Tuesday 1 February 2022

ఆ సమస్య నాకు, నా భర్తకు మధ్యే.. ఇంకొకరితో పనేంటి?: ప్రియమణి ఓపెన్ కామెంట్స్

సీనియర్ హీరోయిన్ సెకండ్ ఇన్నింగ్స్ సూపర్ ఫామ్‌లో కొనసాగుతోంది. అటు బుల్లితెర, ఇటు వెండితెరపై సత్తా చాటుతూ వస్తున్న ఈ బ్యూటీ.. ‘ఫ్యామిలీ మ్యాన్‌’ వెబ్ సిరీస్‌తో డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌‌పై కూడా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇదే బాటలో ఇప్పుడు ‘’ అంటూ మరో కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ‘ఆహా’ ఓటీటీ వేదికపై ఫిబ్రవరి 11న ఈ సినిమా విడుదల కానున్న నేపథ్యంలో చిత్ర ప్రమోషన్స్‌లో పాల్గొంటూ పలు కీలక విషయాలపై ఆమె రియాక్ట్ అవుతోంది. ఈ క్రమంలోనే రీసెంట్‌గా జరిగిన ఓ ఇంటర్వ్యూలో తన పర్సనల్, ప్రొఫెషనల్ లైఫ్ గురించి ప్రియమణి ఓపెన్ అయింది. ‘భామా కలాపం’ చిత్రంలో అనుపమ అనే చెఫ్‌ రోల్ పోషిస్తున్న ఆమె.. ఆ పాత్రకు, నిజ జీవితంలో తను ఉండే విధానానికి ఎలాంటి పోలిక లేదని చెప్పింది. రియల్ లైఫ్‌లో తనకు వంట చేయడం అస్సలు రాదని, తన భర్త ముస్తఫారాజ్‌ వండిపెడితే తినడం మాత్రమే తెలుసంటూ ఓపెన్‌గా చెప్పేసింది. అలాగే ఏదైనా పని ఉంటే తప్ప బయటకు వెళ్లనని, ఎప్పుడూ ఇంటి పట్టున ఉండటమే తనకు ఇష్టమని, తాను గీసుకున్న గీతలోనే ఉంటానని తెలిపింది. ఇకపోతే తన వైవాహిక జీవితానికి సంబంధించి వచ్చే రూమర్స్ అస్సలు పట్టించుకోనని ప్రియమణి చెప్పింది. అలాంటి వార్తలకు రియాక్ట్ అయ్యామంటే అగ్నికి ఆజ్యం పోసినట్టు అవుతుందని, వాటిని అలాగే వదిలేస్తే వాటంతట అవే సర్దుకొంటాయని చెప్పుకొచ్చింది. అంతేకాదు అలాంటి రూమర్లకు వివరణ ఇస్తే తాను తప్పుచేసినట్లు అవుతుందని చెప్పిన ప్రియమణి.. ఓ మహిళ తన కుటుంబానికి, కట్టుకున్న భర్తకు జవాబుదారీగా ఉంటే చాలు. ప్రపంచానికి కాదంటూ ఓపెన్‌గా మాట్లాడింది. జీవితంలో ఎలాంటి సమస్య వచ్చినా తన కుటుంబానికి, లేదంటే తన భర్తకు సమాధానం చెప్పుకొంటాను తప్ప వేరొకరికి సమాధానం చెప్పనని ప్రియమణి తెలిపింది. తన గురించి మీడియాలో అవాస్తవాలు ప్రచారమైతే వాటిని గాలికి వదిలేయడమే తప్ప పట్టించుకోనని ప్రియమణి చెప్పింది. ఇక చివరగా ‘భామా కలాపం’లో అనుపమాలా నిజ జీవితంలో ఉండాలని అనుకోవడం లేదని ఆమె పేర్కొనడం విశేషం.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/I8z9UcjF0

No comments:

Post a Comment

How To Be Aware About Early Heart Disease

'Thirty per cent of the world's deaths in young people, due to heart disease, are encountered by people in India.' from rediff...