Tuesday, 8 February 2022

Mahesh Babu : మ‌హేష్ వ‌ద్దంటే.. విజ‌య్ దేవ‌ర‌కొండ ఓకే అన్నాడు..!

సూప‌ర్ స్టార్ మ‌హేష్ ఓ సినిమా క‌థ‌ను విన్నారు. ఆయ‌న‌కు ఎందుక‌నో అది త‌న‌కు వ‌ర్క‌వుట్ కాద‌నిపించింది. దాంతో ఆయ‌న సింపుల్‌గా నో చెప్పేశారు. అయితే అదే క‌థ‌ను ఇప్పుడు యూత్‌లో క్రేజ్ ఉన్న హీరో విజ‌య్ దేవ‌రకొండ చేయ‌డానికి ముందుకు వ‌చ్చారు. ఇంత‌కీ ఈ ఇద్ద‌రి ద‌గ్గ‌ర‌కు ఒకే క‌థ‌తో వెళ్లిన ద‌ర్శ‌కుడు ఎవ‌రో తెలుసా? పూరీ జ‌గ‌న్నాథ్‌. అస‌లు వివ‌రాల్లోకి వెళితే.. రెండు, మూడేళ్ల ముందు పూరీ జగన్నాథ్ ఓ క‌థ‌ను ఎంతో ఇష్ట‌ప‌డి త‌యారు చేసుకున్నారు. ఆ క‌థే ‘జ‌న‌గ‌ణ‌మ‌న’. ఈ క‌థ‌ను ముందుగా సూప‌ర్ స్టార్ మ‌హేష్‌కి వినిపించారు పూరి. ముందు మ‌హేష్ లైన్ విని ఓకే అన్నారు. దీంతో మ‌హేష్‌, పూరి కాంబినేష‌న్‌లో పోకిరి, బిజినెస్‌మేన్ చిత్రాల త‌ర్వాత మ‌రో సినిమాగా జ‌న‌గ‌ణ‌మ‌న వ‌స్తుంద‌ని పోస్టర్ కూడా వ‌చ్చేసింది. అయితే ఈ సినిమా విష‌యంలో పూరీ జ‌గ‌న్నాథ్ చేసిన ఫైన‌ల్ ప్రొడ‌క్ట్ మ‌హేష్‌కి క‌థ న‌చ్చ‌లేదు. ఆయ‌న డ్రాప్ అయ్యారు. మ‌హేష్ వ‌ద్ద‌న‌డంతో ఎవ‌రో ఒక‌రితే సినిమా చేసేయాల‌నే ఉద్దేశంతో కాకుండా మంచి ఇమేజ్ ఉన్న హీరోతోనే జ‌న‌గ‌ణ‌మ‌న చేయాల‌నేది పూరీ జ‌గ‌న్నాథ్ మైండ్‌లో పెట్టుకున్నారు. ఇప్పుడు ఆయ‌న పాన్ ఇండియా మూవీగా లైగ‌ర్‌ను తెర‌కెక్కిస్తున్నారు. ఈ సినిమా చిత్రీక‌ర‌ణంతా పూర్త‌య్యింది. ఇందులో యూత్‌లో క్రేజ్ సంపాదించుకున్న విజ‌య్ దేవ‌ర‌కొండ హీరోగా న‌టిస్తున్నారు. లైగ‌ర్ ట్రావెల్‌లో పూరి ఓ రోజు విజ‌య్ దేవ‌ర‌కొండ‌కు త‌న జ‌న‌గ‌ణ‌మ‌న క‌థ‌ను వివ‌రించారు. రౌడీ స్టార్‌కు కూడా న‌చ్చేసింది. వెంట‌నే సినిమా చేయ‌డానికి ఓకే చెప్పేశార‌ట‌. ఇంకేముంది పూరి జ‌న‌గ‌ణ‌మ‌న‌కు హీరో దొరికేశాడు. ఆయ‌న అనౌన్స్‌మెంట్ ఇచ్చేశారు. లైగ‌ర్ త‌ర్వాత పూరీ జ‌గ‌న్నాథ్‌, విజ‌య్ దేవ‌ర‌కొండ కాంబోలో పాన్ ఇండియా మూవీగా జ‌న‌గ‌ణ‌మ‌న రూపొంద‌నుంద‌ని ఇండ‌స్ట్రీ వ‌ర్గాల టాక్‌. ఇప్ప‌టికైతే ప్రాజెక్ట్ లాక్ అయ్యింది. కానీ.. వివ‌రాలు వెల్ల‌డి కాలేదు. త్వ‌ర‌లోనే జ‌న‌గ‌ణ‌మ‌న‌కు సంబంధించిన పూర్తి వివ‌రాలు వెల్ల‌డి కానున్నాయ‌ని సినీ వ‌ర్గాల స‌మాచారం.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/mRgNicQ

No comments:

Post a Comment

Gulf War: 'If America Wants An Exit, It Can'

'US and Iran have not annulled the ceasefire, and the possibility of continuing negotiations remains open.' from rediff Top Interv...