Monday, 7 February 2022

ప్రామిస్... ఆ ప‌ని చేస్తే బాయ్ ఫ్రెండ్ ఎవ‌రో చెప్తా.. మెలిక పెట్టిన మాళ‌వికా మోహ‌న‌న్‌ !

సినిమాల కంటే సోష‌ల్ మీడియాలో య‌మా యాక్టివ్‌గా ఉండే ముద్దుగుమ్మ‌ల్లో మాళ‌వికా మోహ‌న్ ఒక‌రు. ఈ అమ్మ‌డు అందాల ఆర‌బోత‌తో సోష‌ల్ మీడియాలో మంట పెట్టేస్తుంటుంది మ‌రి. ఆ ఇన్‌స్టాలో షేర్ చేసే ఫొటోలు, వీడియోల‌ను గ‌మ‌నిస్తే ఈ విష‌యాన్ని మ‌నం నిజ‌మ‌ని ఒప్పుకోక త‌ప్ప‌దు. ఇంత గ్లామ‌ర‌స్ బ్యూటీకి భాయ్ ఫ్రెండ్ లేడా అంటే ఉన్నాడ‌ట‌. ఈ విష‌యాన్ని చెప్పింది ఎవ‌రో కాదు.. ఆమెనే. ఇటీవ‌ల అమ్మ‌డు మాల్దీవుల‌కు ట్రిప్‌కు వెళ్లింది. అక్క‌డ ఆమె తీసుకున్న ఫొటోల‌ను, వీడియోల‌ను త‌న సోష‌ల్ మీడియాలో షేర్ చేసి ర‌చ్చ కూడా చేసింది. రీసెంట్‌గా మాళ‌విక ఓ వీడియోను త‌న ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. అందులో మాల్దీవులు ట్రిప్‌ను పూర్తి చేసిన మాళ‌వికా మోహ‌న‌న్‌ను ట్రిప్ ఎలా జ‌రిగింది? అని ప్ర‌శ్నిస్తే.. చాలా సూప‌ర్బ్‌గా ఎంజాయ్ చేశామంది. అదే స‌మ‌యంలో ఆమె త‌న‌కు ఓ బాంబేకి చెందిన ఓ కంపెనీ మాళ‌వికాకు ఓ గిఫ్ట్ ఇచ్చారు. అదొక షేవింగ్ కిట్‌. ఈ గిఫ్ట్‌ను మాళవిక తన వీడియోలో చూపించింది. ఇది మ‌గ‌వారు వాడే బ్రాండ్ క‌దా, అంటే నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? అని ప్ర‌శ్నిస్తే అవును ఉన్నాడు? అని గ‌డుసుగా స‌మాధానం చెప్పింది మాళ‌వికా మోహ‌నన్‌. అయితే అదెవ‌రో చెప్పాల‌ని అంటే ‘నా బాయ్ ఫ్రెండ్ ఎవరో తెలుసుకోవాల‌ని ఉందా? అయితే ఇప్పుడు పోస్ట్ చేసిన వీడియోకు వ‌న్ మిలియ‌న్ (ప‌ది ల‌క్ష‌లు) వ్యూస్ వ‌స్తే.. ప్ర‌మాణ పూర్తిగా నా బాయ్ ఫ్రెండ్ ఎవ‌రో చెబుతాను’ అంటూ చిన్న మెలిక పెట్టింది. నిజంగానే మాళవికకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడో లేదో తెలియ‌దు కానీ.. సీక్రెట్ తెలియాలంటే మాత్రం వీడియోకు ప‌ది ల‌క్ష‌లు వ్యూస్ రావాల్సిందే. 2013లో ప‌ట్టం పోలే అనే మ‌ల‌యాళ చిత్రంతో సినీ రంగ ప్ర‌వేశం చేసింది మాళ‌వికా మోహ‌న‌న్‌. త‌ర్వాత రెండేళ్లు గ్యాప్ తీస‌కుని నిర్ణ‌యాకం అనే మ‌రో మ‌లయాళ సినిమాలో యాక్ట్ చేసింది. త‌దుప‌రి నాను మ‌ట్టు వ‌ర‌ల‌క్ష్మి అనే క‌న్న‌డ సినిమాలో సంద‌డి చేసింది. త‌మిళంలో ర‌జ‌నీకాంత్ హీరోగా చేసిన‌ పేట‌, ద‌ళ‌ప‌తి విజ‌య్ హీరోగా చేసిన మాస్ట‌ర్ చిత్రాల్లో న‌టించింది. ధ‌నుష్‌తో చేసిన మార‌న్ మూవీ విడుద‌ల కావాల్సి ఉంది. ఇక‌ బాలీవుడ్‌లో బియాండ్ ది క్లౌడ్స్‌, యుద్ర సినిమాల్లో న‌టించింది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/y2pC1bJ

No comments:

Post a Comment

'FY27 Presents Clear Runway for Earnings Improvement'

'In investing, poor sentiment is always a good vintage to build a portfolio.' from rediff Top Interviews https://ift.tt/MCehzZE