Friday, 22 October 2021

ఎవరు ఎవరిని కాపీ కొట్టారు?.. తమన్, అల్లు అర్జున్‌లపై నెట్టింట్లో చర్చ.. ఇంతకీ కథేంటంటే?

నెట్టింట్లో మీద వచ్చే ట్రోల్స్, మీమ్స్ మామూలుగా ఉండవు. తమన్ నుంచి ఏదైనా కొత్త పాట వచ్చిందంటే చాలు దాని మీద ఎంతో మంది కళ్లు పడతాయి. దాని మూలం ఎక్కడుంది? ఎక్కడి నుంచి కాపీ కొట్టేశాడు? అనేది అంతా కూడా కూపీ లాగుతుంటారు. అలా తమన్ మీద తాజాగా సరి కొత్త ట్రోలింగ్ నడుస్తోంది. నిన్న మహేష్ బాబుతో కలిసి దిగిన ఫోటోను తమన్ షేర్ చేశాడు. ఇందులో అందం ఎప్పటిలానే టాక్ ఆఫ్ ది టౌన్ అయింది. దాంతో పాటు మరో విషయం కూడా ట్రెండ్ అవుతోంది. తమన్ ధరించిన టీషర్ట్ మీద విపరీతంగా ట్రోలింగ్ నడిచింది. మొన్న జరిగిన మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్‌లర్ సినిమా సక్సెస్ మీట్‌లో ఓ టీషర్ట్ ధరించాడు. ఆ టీ షర్ట్.. ఇప్పుడు తమన్ వేసుకున్న టీ షర్ట్ ఒక్కటేనని నెటిజన్లు ట్రోల్ చేశారు. ట్యూన్స్ మాత్రమే కాదు టీ షర్టులు కూడా కాపీ కొడుతున్నావా? అని తమన్‌ను ఏకిపారేశారు. అయితే వెంటనే తమన్ ఫ్యాన్స్ రంగంలోకి దిగారు. తమన్ కాపీ కొట్టలేదు. ఆల్రెడీ భీమ్లా నాయక్ సినిమా ప్రమోషనల్ సాంగ్‌లోనే ఆ టీ షర్ట్ ధరించాడు అని ఫ్రూప్స్ చూపించారు. దీంతో అసలు కథ అడ్డం తిరిగింది. అయితే తమన్ టీ షర్ట్‌ను బన్నీయే కాపీ కొట్టాడా? అని ఇంకో కొత్త చర్చ బయటకు వచ్చింది. మొత్తానికి తమన్ టీ షర్ట్ నెట్టింట్లో గట్టిగానే చర్చకు దారి తీసింది. ఎవరు ముందు కొన్నారు? ఎవరు ఎవరిని కాపీ కొట్టారు? అనేది వారికే తెలియాలి.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3B5pQby

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....