Friday, 22 October 2021

అక్కడ ముద్దు పెట్టిన ఆండ్రూ.. భర్త కంటే శ్రియానే స్పీడు మీదుంది!

హీరోయిన్ , ఆమె భర్త ఆండ్రూ ఎంత సరదాగా, చిలిపిగా ఉంటారో అందరికీ తెలిసిందే. ఇది పబ్లిక్ ప్లేస్ అయినా ప్రైవేట్ ప్లేస్ అయినా సరే ఈ ఇద్దరూ ఒకేలా ఉంటారు. చుట్టూ వందల మంది ఉన్నా, ఇద్దరే ఏకాంతంగా ఉన్నా కూడా ఒకేలా సరసాలు ఆడేట్టు కనిపిసిస్తున్నారు. ఈ ఇద్దరి రొమాంటిక్స్ పిక్స్ , వీడియోలు ఇప్పటికే నెట్టింట్లో తెగ వైరల్ అయ్యాయి. ముద్దులతో ఈ జంట నెటిజన్లను అవాక్కయ్యేలా చేసింది. అయిత ఈ సారి బుల్లితెర మీద ఈ జంట కనిపించి, ఇంగ్లీష్ ముద్దులతో అందరినీ ఆశ్చర్యపరచింది. శ్రియ తన భర్తను ఇంత వరకు ప్రేక్షకుల ముందుకు తెర మీదకు తీసుకురాలేదు. కానీ మొదటిసారిగా భర్తతో కలిసి జీ తెలుగు ఈవెంట్‌లో కనిపించింది. అంగరంగ వైభవంగా జరగబోతోన్న వేడుకలో శ్రియ తన భర్త ఆండ్రూతో కలిసి తళుక్కున మెరిసింది. అలా రావడమే కాదు స్టేజ్ మీదే అందరికీ షాక్ ఇచ్చింది. జీ తెలుగు కూడా వారి ఇద్దరికి ఎంతో గ్రాండ్‌గా వెల్కమ్ చెప్పేశారు. ఇంగ్లీష్ తప్ప మరే భాష రాని ఆండ్రూ సైతం తెలుగులో మాట్లాడాడు. అందరికీ నమస్కారం అని చెప్పాడు. ఆ ఒక్క పదాన్ని బాగానే నేర్చుకున్నట్టున్నాడు. అయితే ఆండ్రూ అలా మాట్లాడటంతో శ్రియా షాక్ అయినట్టుంది. సోషల్ మీడియాలో ఎలా పోజులు పెడతారు అని ప్రదీప్ అనడంతో.. కొన్ని రొమాంటిక్ స్టిల్స్ పెట్టారు. ఇక చివర్లో శ్రియ బుగ్గ మీద ఆండ్రూ ముద్దు పెట్టేశాడు. తానేమీ తక్కువ తిన్నానా? అన్నట్టుగా శ్రియా అయితే ఏకంగా ఇంగ్లీష్ కిస్ పెట్టేసింది. అలా పెదవికి పెదవితో ముద్దు పెట్టడంతో అక్కడకి వచ్చిన బుల్లితెర తారలు అవాక్కయ్యారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2ZeiB4h

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....