Saturday, 30 October 2021

Shyam Singha Roy : RISE OF SHYAM అంటూ నాని రచ్చ.. ఫస్టి సింగిల్ ఎప్పుడంటే?

నేచురల్ స్టార్ వరుసగా సినిమాలు రెడీ చేస్తున్నాడు. లాక్డౌన్ వచ్చి పెద్ద హీరోలు కూడా ఎవ్వరూ సినిమాలను రిలీజ్ చేయలేదు. కానీ నాని మాత్రం గత లాక్డౌన్ సమయంలో ఓ చిత్రాన్ని వదిలాడు. మళ్లీ ఈ లాక్డౌన్ తరువాత ఇంకో చిత్రాన్ని వదిలాడు. అయితే అలా నాని ఓటీటీలో తన చిత్రాలను వదిలేస్తూ ఆడియెన్స్‌ను ఎంటర్టైన్ చేస్తున్నాడు. కానీ సినిమాలు మాత్రం అనుకున్నంతగా ఆడటం లేదు. నాని వీ, టక్ జగదీష్ సినిమాలు అంతగా వర్కవుట్ అవ్వలేదు. అలా ఓటీటీలు నానికి కలిసి రావడం లేదో ఏమో గానీ.. ఇక ఇప్పుడు మాత్రం నాని దుమ్ములేపేందుకు రెడీ అవుతున్నాడు. నాని రాహుల్ సంకృత్యాన్ కాంబోలో అనే సినిమా రాబోతోన్న సంగతి తెలిసిందే. కలకత్తా నేపథ్యంలో, పునర్జన్మల బ్యాక్ డ్రాప్‌లో ఈ సినిమా ఉండబోతోన్నట్టు టాక్. అందుకే రెండు షేడ్స్ ఉన్న లుక్స్‌ను రివీల్ చేశారు. ఒక దాంట్లో ఎంతో సీరియస్‌గా ఉంటే ఇంకో దాంట్లో ఎంతో కూల్‌గా కనిపించాడు. మొత్తానికి ఈ సారి కథను కలకత్తాకు తీసుకెళ్లి హిట్ పట్టుకొస్తాడేమో. నిహారిక ఎంటర్టైన్మెంట్స్‌పై వెంకట్ బోయనపల్లి ఎక్కడా కూడా కాంప్రమైజ్ కాకుండా అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోన్న ఈ సినిమా మ్యూజికల్ ప్రమోషన్స్ ప్రారంభించేశారు. మిక్కీ జే మేయర్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించాడు. అంటూ మొదటి పాటను నవంబర్ 6న విడుదల చేయబోతోన్నట్టు ప్రకటించారు. ఈ మేరకు ఓ పోస్టర్‌ను వదిలారు. అందులోనాని దర్జాగా కూర్చున్నాడు. ఓ చేతితో సిగరేట్ ఉంది.. కళ్లు మాత్రం ఎంతో సీరియస్‌గా కనిపిస్తోంది. మొత్తానికి శ్యామ్ సింగ రాయ్ కథ వేరేలా ఉందనిపిస్తోంది. సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్‌లుగా నటిస్తోన్న ఈ చిత్రానికి సత్యదేవ్ జంగా కథను అందించారు. జాన్ వర్గీస్ కెమెరామెన్‌గా పని చేస్తున్నారు. నవీన్ నూలి ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ చిత్రం క్రిస్మస్ కానుకగా.. తెలుగు తమిళ కన్నడ మళయాల భాషల్లో డిసెంబర్ 24న విడుదల కాబోతోంది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3GBxpKT

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....