Thursday, 28 October 2021

Romantic Twitter Review: పూరి తనయుడి సినిమా ఎలా ఉందంటే..

పూరి తనయుడు హీరోగా రూపొందిన కొత్త సినిమా ''. యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. అనిల్ పాదూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా నిర్మాణ బాధ్యతలు దగ్గరుండి చూసుకున్నారు . ఈ మూవీతో తన తనయుడి ఎలాగైనా ట్రాక్ ఎక్కించాలని బలంగా ఫిక్సయిన పూరి.. చిత్ర ప్రమోషన్స్ విషయంలో స్పెషల్ కేర్ తీసుకొని సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేశారు. నేడు (అక్టోబర్ 29) ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది. అయితే ఇప్పటికే ఈ మూవీ ప్రీమియర్స్ చూసిన సినీ ప్రముఖులు, టాలీవుడ్ దర్శక నిర్మాతలు సినిమాపై ప్రశంసల వర్షం కురిపించారు. అదేవిధంగా ఈ మూవీ చూసిన ఆడియన్స్ సినిమా ఎలా ఉందో తమ తమ అభిప్రాయాలు తెలుపుతూ ట్విట్టర్‌లో పోస్టులు పెడుతున్నారు. పూరి స్టైల్‌లో ఈ మూవీ అదిరిపోయిందని, పూరి గారి అబ్బాయి ఇరగదీశాడని అంటున్నారు. పూరీ కనెక్ట్స్ పతాకంపై పూరీ జగన్నాథ్‌, ఛార్మి సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకు సునీల్‌ కశ్యప్‌ సంగీతం అందించారు. రమ్యకృష్ణ పవర్ ఫుల్ పోలీసాఫీసర్‌గా నటించింది. ఆకాష్ సరసన హాట్ బ్యూటీ కేతిక శర్మ హీరోయిన్‌గా నటించింది. ఇప్పటికే విడుదలైన రొమాంటిక్ పోస్టర్స్, టీజర్, ట్రైలర్స్ సినిమాపై ఓ రేంజ్ అంచనాలు క్రియేట్ చేయగా.. ప్రభాస్ అందించిన ప్రమోషన్స్ ప్లస్ అయ్యాయి.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/31dAEIk

No comments:

Post a Comment

'Trump May Expand H-1B Program'

'Trump has signaled that he has changed his stance on the H1B visa from his first term.' from rediff Top Interviews https://ift.tt...