Saturday, 30 October 2021

ఆశ ఎన్‌కౌంటర్ ట్రైలర్: కల్పితం అంటూనే అంతా చూపించిన ఆర్జీవీ

కాంట్రవర్సీ ఎక్కడ ఉంటే చూపు అక్కడే. ఈ విషయాన్ని ఎవరో చెప్పడం కాదు.. ఆయన తీరు చూసే ప్రతి ఒక్కరికీ అర్థమవుతుంది. వివాదాస్పద సినిమాలు తీయడంలో తనకంటూ స్పెషల్ ఐడెంటిటీ క్రియేట్ చేసుకున్న ఆయన.. ఎవరెన్ని విమర్శలు చేసినా తన దారి తనదే అన్నట్లుగా వెళుతున్నారు. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్‌ నగర శివారులో జరిగిన నేపథ్యంలో సినిమా రూపొందించారు ఆర్జీవీ. నవంబర్ 26, 2019న షాద్ నగర్ సమీపంలో జరిగిన దిశ సామూహిక అత్యాచారం యావత్ భారత దేశాన్ని ఆగ్రహంలో ముంచెత్తింది. ఆ తర్వాత దిశ నిందితులు ఎన్‌కౌంటర్ చేయబడ్డారు. అయితే నలుగురు యువకులు అత్యంత పాశవికంగా దిశను సామూహిక అత్యాచారం చేసి హతమార్చిన ఈ దుర్ఘటనను, ఆ తర్వాత ఆ దారుణానికి ఒడిగట్టిన ఆ నలుగురు యువకుల ఎన్‌కౌంటర్ దృశ్యాలను తన సినిమాలో చూపించబోతున్నారు రామ్ గోపాల్ వర్మ. ఈ మూవీకి ఆశ ఎన్ కౌంటర్ అని పేరు పెట్టిన ఆర్జీవీ.. తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు. 2 నిమిషాల నిడివితో కూడిన ఈ వీడియోలో దిశ ఘటనను చూపించే ప్రయత్నం చేశారు. అయితే ట్రైలర్ మొదట్లో మాత్రం 'ఈ చిత్రం ఏ వ్యక్తుల పైన, ఏ ఘటనల పైన ఆధారపడి తీయలేదు కేవలం కల్పితం' అని చెబుతూ తనదైన దారిలో వెళ్లారు వర్మ. చిత్రాన్ని దిశ సంఘటన చోటు చేసుకున్న తేదీ నవంబర్ 21న రిలీజ్ చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఇకపోతే ఈ సినిమా సోనియా ఆశ అనే అమ్మాయి టైటిల్ రోల్ పోషిస్తోందని ఆర్జీవీ తెలిపారు. అనురాగ్‌ కంచర్ల ప్రొడక్షన్‌పై నిర్మిస్తున్న ఈ సినిమాకు ఆనంద్‌ చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2ZL0AKP

No comments:

Post a Comment

'I Wanted Waheeda Rehman For Ankur'

'I don't think Waheeda had the confidence that I could pull it off, so she said no.' from rediff Top Interviews https://ift.tt...