Sunday 31 October 2021

అమ్మాయిల ప్రైవేట్ పార్ట్స్‌తో ఆడుకోవడం సరదా!.. కామాంధుడి గుట్టు విప్పిన చిన్మయి

సింగర్,డబ్బింగ్ ఆర్టిస్ట్, నటి సోషల్ మీడియాలో ఎంత బిజీగా ఉంటారో అందరికీ తెలిసిందే. మహిళ సమస్యలను ఎప్పుడూ ప్రపంచానికి తెలిసేలా చేస్తుంటుంది. మహిళలు ఎదుర్కొనే బాధలను, సమాజంలో అమ్మాయిలపై జరిగే అకృత్యాలను ఎప్పటికప్పుడూ ఎత్తి చూపిస్తూనే ఉంటుంది. అలాంటి చిన్మయి తాజాగా కొన్ని స్టోరీలను షేర్ చేసింది. తన ఇన్ స్టాగ్రాం స్టోరీల్లో ఓ కామాంధుడి కథను చెప్పింది. ఇద్దరు వ్యక్తులు చాటింగ్ చేసుకున్న తీరు.. అందులోనే చర్చించుకున్న విషయాలు, మాట్లాడుకున్న అసభ్యకర పదజాలం గురించి చిన్మయి స్పందించింది. మొన్నటికి మొన్న సబ్యసారి అడ్వర్టైజ్మెంట్, మంగళసూత్రాల మీద ఆయన చేసిన అసభ్యకర యాడ్ వివాదాస్పదంగా మారింది. దానిపై చిన్మయి స్పందించింది. మంగళసూత్రం కేవలం ఓ ఆభరణం లాంటిదేనని చిన్మయి అభిప్రాయపడింది. అయితే అది కేవలం ఆడవారికే ఎందుకు.. మరి మగవాళ్లకు పెళ్లైందని చూపించేందుకు ఎందుకు ఎలాంటి ఆభరణాలు పెట్టలేదని చిన్మయి ప్రశ్నించింది. అయితే తాజాగా ఓ కామాంధుడు చేసిన చాటింగ్, తన ఫ్రెండుతో పెట్టిన ముచ్చట్ల గురించి చిన్మయి గుట్టు విప్పింది. వాడికి పద్నాలుగేళ్ల వయసు వచ్చినప్పుడు అమ్మాయిల వక్షోజాల మీద కన్ను పడింది. వాటిని పట్టుకోవడం వాడికి సరదా అంటా. రద్దీగా ఉన్న చోట లేదా ఒంటరిగా ఉన్న సమయంలో అమ్మాయిల వక్షోజాలను తాకేవాడట. దాంట్లో వాడు ఎక్స్ పర్ట్ అంటా. అలా తన గురించి తాను గొప్పగా చెప్పుకున్నాడు. ఆ వయసులో అది సరదా అని అలా తన గ్యాంగులో తానే గ్రేట్.. ఎక్కువ మందివి పట్టుకున్నాను అంటూ చెప్పుకొచ్చాడు. అయితే ఇలాంటి వాళ్లు కూడా సమాజంలో ఉన్నారు చూడండి అంటూ చిన్మయి తీవ్రంగా ఆవేదన చెందింది. సరదా కోసం అలాంటి పనులు చేసేవాడట అంటూ చిన్మయి ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇంకా చాలా చండాలంగా చేసిన ఆ చాటింగ్ వివరాలు, చేసిన ఘన కార్యాలు రాయడానికి కూడా వీల్లేకుండా ఉన్నాయి.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2ZD3DoF

No comments:

Post a Comment

'Don't Involve My Family!'

'My weakness is my family, and the people I love.' from rediff Top Interviews https://ift.tt/2lOucDz