Thursday, 28 October 2021

హాస్పిటల్‌లో జాయిన్ అయిన రజినీకాంత్.. కుటుంబ స‌భ్యులేమ‌న్నారంటే?

కోలీవుడ్ సూపర్‌స్టార్ ర‌జినీకాంత్ గురువారం సాయంత్రం హాస్పిట‌ల్‌లో జాయిన్ అయ్యారు. ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో కొంద‌రు సోష‌ల్ మీడియాలో చేసిన పోస్టుల‌ను అనుస‌రించి చూస్తే ఆయ‌న హాస్పిట‌ల్‌లో జాయిన్ అయిన‌ట్లు తెలుస్తుంది. అయితే ఈ ర‌జినీకాంత్ హాస్పిట‌ల్‌లో జాయిన్ అయ్యార‌ని ఎవ‌రూ బెంగ‌ప‌డొద్ద‌ని, ఆయ‌న రొటీన్ చెక‌ప్ కోస‌మే చేరార‌ని, పూర్తి ఆరోగ్యంతో ఉన్నార‌ని ర‌జినీ స‌తీమ‌ణి ల‌తా ర‌జినీకాంత్ ఎలియ‌జేసిన‌ట్లు కోలీవుడ్ వ‌ర్గాల స‌మాచారం. రీసెంట్‌గానే ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి ఢిల్లీ వెళ్లి ఉప రాష్ట్రప‌తి వెంక‌య్య‌నాయుడు చేతుల మీదుగా దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్నారు. దీనిపై ఆయ‌న ఫ్యాన్స్ సంతోషంగా ఉన్న స‌మ‌యంలో ఇప్పుడు ఇలాంటి వార్త‌లు రావ‌డం ఫ్యాన్స్‌ను క‌ల‌వ‌ర‌పెడుతోంది. నిజానికి 2021 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని రజినీకాంత్ నిశ్చయించుకుని పెద్దన్న సినిమాను త్వరగా పూర్తి చేయాలనుకున్నారు. అయితే ఆయనకు ఆరోగ్య సమస్యలు వచ్చాయి. డాక్టర్స్ టెన్షన్స్‌కు దూరంగా ఉండాలని సూచించినప్పుడు తలైవా ఆరోగ్యం సరిగా లేని కారణంగా రాజకీయాల్లోకి రావడం లేదని క్లారిటీగా చెప్పేశారు. చాలా రోజులు రెస్ట్ తీసుకుని మళ్లీ పెద్దన్న సినిమాను పూర్తి చేశారు. దీపావళి సంద‌ర్భంగా ర‌జినీకాంత్ న‌టించిన ‘పెద్ద‌న్న‌’(అన్నాత్త‌) దీపావళి సంద‌ర్భంగా న‌వంబ‌ర్ 4న విడుద‌లవుతుంది. రీసెంట్‌గానే పెద్దన్న ట్రైలర్ విడుదలై మంచి స్పందనను రాబట్టుకుంది. ఇందులో ఖుష్బూ, మీనా, నయనతార హీరోయిన్స్‌గా కనిపిస్తుంటే మరో హీరోయిన్ కీర్తి సురేశ్ రజినీకాంత్ చెల్లెలుగా కనిపించనున్నారు. ట్రైలర్‌కు మంచి స్పందన రావడంతో అభిమానులు త‌మ త‌లైవ‌ర్ సినిమాను థియేట‌ర్స్‌లో ఘ‌నంగా సెల‌బ్రేట్ చేయాల‌నుకున్నారు. ఫ్యాన్స్ సంతోషంగా ఉన్న ఇలాంటి స‌మ‌యంలో ఆయ‌న హాస్పిట‌ల్‌లో జాయిన్ అయ్యార‌నే వార్త అంద‌రిలో టెన్ష‌న్‌కు గురి చేసినా, రొటీన్ చెక‌ప్‌కు వెళ్లార‌ని, ఆరోగ్యంగానే ఉన్నార‌ని ల‌తా ర‌జినీకాంత్ తెలియజేడం అభిమానులకు ఊరటనిచ్చే అంశం.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3CoxGhX

No comments:

Post a Comment

RBI Governor: 'Rates may remain low in near to medium term'

"It is quite possible that the rates will remain low in the near to medium term, but that will depend on how conditions evolve," s...