Saturday, 30 October 2021

NTR: పునీత్ రాజ్‌కుమార్‌కు ఎన్టీఆర్ నివాళి...కాసేపు మౌనంగా అలానే చూసిన తార‌క్‌

క‌న్న‌డ అగ్ర క‌థానాయ‌కుడు పునీత్ రాజ్‌కుమార్ మ‌ర‌ణ వార్త తెలిసిన సినీ ఇండ‌స్ట్రీ షాక‌య్యింది. ముఖ్యంగా టాలీవుడ్ స్టార్స్ తో పునీత్ రాజ్‌కుమార్‌కు స‌న్నిహిత సంబంధాలున్నాయి. ముఖ్యంగా ఎన్టీఆర్‌కు పునీత్‌కు మంచి అనుబంధం ఉంది. పునీత్ మ‌రి లేర‌నే వార్త విన‌గానే తార‌క్ షాక‌య్యారు. శ‌నివారం ఆయ‌న బెంగుళూరు చేరుకుని పునీత్ రాజ్‌కుమార్ పార్థివ దేహానికి నివాళులు అర్పించారు. ఆయ‌న చాలా సేపు పునీత్ రాజ్‌కుమార్ పార్థివ దేహాన్ని అలా చూస్తుండిపోయారు. ఆ స‌మ‌యంలో ఎవ‌రితోనూ మాట్లాడ‌లేదు. క‌ళ్లార్ప‌కుండా అలా కొద్ది సేపు చూసిన చివ‌ర‌కు న‌మస్కారం చేసి అక్క‌డ నుంచి పునీత్ అన్న‌య్య శివ రాజ్‌కుమార్‌ను క‌లిసి ఆయ‌న్ని ఓదార్చారు. అక్క‌డ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చేశారు. ఎన్టీఆర్‌ను పునీత్ రాజ్‌కుమార్ త‌న సోద‌రుడిగా భావించేవారు. ఆ అనుబంధంతోనే పునీత్ హీరోగా న‌టించిన చ‌క్ర‌వ్యూహ చిత్రంలో ఎన్టీఆర్ గెల‌యా..గెలయా అనే పాట‌ను పాడారు. ఈ సినిమాకు ఎస్‌.ఎస్‌.త‌మ‌న్ సంగీతం అందించారు. అంత‌కు ముందుగానే పునీత్ పార్థివ దేహాన్ని సంద‌ర్శించిన బాల‌కృష్ణ ఎమోష‌న‌ల్‌గా క‌న్నీళ్లు పెట్టుకున్నారు. ఇదంతా విధిరాత అంటూ త‌ల కొట్టుకున్నారు. రాజ్‌కుమార్ ఫ్యామిలీతో త‌మ‌కున్న అనుబంధాన్ని ఆయ‌న ఈ సంద‌ర్భంగా నెమ‌ర‌వేసుకున్నారు. నందమూరి హీరోల‌తో పాటు ఇటు చిరంజీవి కుటుంతో, మోహ‌న్‌బాబు ఫ్యామిలీ, మ‌హేశ్ ఫ్యామిలీతో పునీత్‌కు మంచి అనుబంధం ఉంది. ప్ర‌స్తుతం పునీత్ రాజ్‌కుమార్‌ పార్థివ దేహాన్ని కంఠీర‌వ స్టేడియంలో అక్క‌డ ప్ర‌జ‌ల సంద‌ర్శనార్థం ఉంచారు. ల‌క్ష‌లాదిగా ప్ర‌జ‌లు పునీత్‌కు నివాళ‌లు అర్పిస్తున్నారు. శ‌నివారం సాయంత్రం అంత్య‌క్రియ‌లు జ‌రుగుతాయి. ప్ర‌స్తుతం పునీత్ రాజ్‌కుమార్ కుమార్తె వందిత‌ అమెరికా నుంచి వ‌స్తున్నారు. ఆమె శ‌నివారం బెంగ‌ళూరుకి చేరుకుంటారు. ఆమె తుది చూపు చూసిన త‌ర్వాత పునీత్ రాజ్‌కుమార్ అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛ‌నాల‌తో జరుగుతాయి.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3jQa2nj

No comments:

Post a Comment

'Don't Find Anything Wrong With Nepotism'

'Why would a star's son not become an actor?' from rediff Top Interviews https://ift.tt/wsEaB64