Friday, 29 October 2021

Ravi Teja: 'ఖిలాడి' లేటెస్ట్ అప్‌డేట్: మాస్ మహారాజ్ దీపావళి కానుక సిద్ధం

మాస్ మహారాజ్ హీరోగా రమేష్ వర్మ దర్శకత్వంలో రూపొందుతున్న కొత్త సినిమా ''. ఈ సినిమాలో రవితేజ డ్యూయల్ రోల్‌లో కనిపించబోతున్నారు. డింపుల్ హయాతి, మీనాక్షి చైదరీ హీరోయిన్లుగా నటిస్తున్నారు. కరోనా సెకండ్ వేవ్ కంటే ముందే షూటింగ్ ప్రారంభించుకున్న ఈ మూవీ షూటింగ్ కంప్లీట్ చేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటోంది. ‘రాక్షసుడు’ వంటి విజయం తర్వాత రమేష్ వర్మ రూపొందిస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన అన్ని అప్‌డేట్స్ ఆ అంచనాలకు రెక్కలు కట్టాయి. ఈ నేపథ్యంలో చిత్ర ప్రమోషన్స్ మరింత వేగవంతం చేసిన చిత్రయూనిట్ మాస్ మహారాజ్ అభిమానుల కోసం దీపావళి కానుక సిద్ధం చేసింది. నవంబర్ 4వ తేదీన దీపావళి కానుకగా చిత్రంలోని సెకండ్ సాంగ్ రిలీజ్ చేస్తున్నారు. ఈ విషయాన్ని రవితేజ తన ట్విట్టర్ వేదికగా పేర్కొంటూ కొత్త పోస్టర్ షేర్ చేశారు. జీవితంలో డబ్బుకే ప్రాధాన్యం ఇవ్వాలా? భావోద్వేగాలకు ఇవ్వాలా? లేక రెండూ ముఖ్యమా? అని ఆలోచింపజేసే పాత్రల సమ్మేళనమే ఈ 'ఖిలాడీ' మూవీ అంటున్నారు మేకర్స్. జయంతిలాల్‌ గడ సమర్పణలో హ‌వీష్ ప్రొడ‌క్ష‌న్‌, పెన్ స్టూడియోస్ బ్యానర్‌పై రూపుదిద్దుకుంటున్న ఈ మూవీకి 'ప్లే స్మార్ట్' అనేది ట్యాగ్‌లైన్‌. ఈ చిత్రంలో అనసూయ భరద్వాజ్, అర్జున్ కీలక పాత్రల్లో నటిస్తుండగా, రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. అతి త్వరలో రిలీజ్ డేట్ అనౌన్స్ చేయనున్నారు మేకర్స్.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3vYThLw

No comments:

Post a Comment

RBI Governor: 'Rates may remain low in near to medium term'

"It is quite possible that the rates will remain low in the near to medium term, but that will depend on how conditions evolve," s...