Saturday, 30 October 2021

ఆ కోరిక తీరకుండానే పునీత్ వెళ్లిపోయారు.. విషయం చెబుతూ డైరెక్టర్ ఎమోషనల్ కామెంట్స్

క‌న్న‌డ స్టార్ హీరో శుక్ర‌వారం గుండెపోటుతో మ‌ర‌ణించిన సంగ‌తి తెలిసిందే. ఆయన మరణంతో యావత్ సినీ ఇండస్ట్రీ శోక సంద్రంలో మునిగిపోయింది. ఎంతో భవిష్యత్, ఇతరులను ఆదుకోవాలనే మంచి మనసున్న పునీత్ ఇకలేరనే వార్తను ఏ ఒక్కరూ జీర్ణించుకోలేక పోతున్నారు. ఇక ఆయ‌న‌తో అనుబంధం ఉన్న పలు భాషల సినీ సెల‌బ్రిటీలయితే కన్నీరుమున్నీరయ్యారు. పలువురు స్టార్స్ బెంగుళూరు చేరుకొని పునీత్ భౌతికకాయానికి నివాళులర్పించారు. అయితే పునీత్ తన చిరకాల కోరిక నెరవేరకుండానే వెళ్లిపోయారని పేర్కొంటూ దర్శకుడు ఎమోషనల్ అయ్యారు. ఈ మేరకు పునీత్‌తో తనకున్న అనుబంధాన్ని పంచుకుంటూ అసలు విషయం చెప్పారు. పునీత్ వల్లే తాను వెండితెరకు పరిచయమయ్యానని గుర్తు చేసుకున్నారు. తన రెండో ప్రాజెక్ట్‌ ‘అజయ్‌’ కూడా ఆయనతోనే చేశానని చెప్పారు. తాను గారితో '' సినిమా ప్రకటించిన వెంటనే తనకు పునీత్ కాల్ చేసి అభినందించారని మెహర్ రమేష్ చెప్పారు. అలాగే చిరంజీవి గారితో నటించాలనే తన కోరికను ఈ సినిమాతో తీర్చాలని ఆయన కోరినట్లు తెలిపారు. వీలైతే అతిథి పాత్ర లేదంటే కనీసం పాటలోనైనా ఆయనతో కలిసి ఓ చిన్న స్టెప్పు వేస్తానని పునీత్ తనతో అన్నారని మెహర్ రమేష్ చెప్పుకొచ్చారు. అయితే ఈ విషయాన్ని తాను చిరంజీవి గారితో కూడా చర్చించానని, పునీత్ కోసం ఓ స్పెషల్ రోల్ రాయాలని అనుకున్నానని, అలాగే నవంబర్‌లో జరగనున్న మా సినిమా ప్రారంభోత్సవానికి పునీత్‌ను ముఖ్యఅతిథిగా పిలవాలని భావించామని చెప్పారు. ఇంతలో పునీత్ ఈ లోకం విడిచి వెళ్లారని తెలుపుతూ కన్నీరు పెట్టుకున్నారు మెహర్ రమేష్. కాగా, పునీత్ భౌతిక కాయానికి నివాళులర్పించిన చిరంజీవి.. పునీత్‌ రాజ్‌కుమార్‌ అకాలమరణం తీవ్రంగా కలచివేసిందని అన్నారు. బెంగళూరు వచ్చిన ప్రతిసారి పునీత్‌ను కలిసేవాడినని, దేవుడు చాలా అన్యాయం చేశాడని అన్నారు. ఆయన కుటుంబానికి ఆ భగవంతుడు ధైర్యం ఇవ్వాలని ప్రార్థిస్తున్నా అని పేర్కొన్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3bGA9Zr

No comments:

Post a Comment

'3-Language Formula Is A Burden On All Students'

'Why should children, who are already burdened with so many subjects, be over-burdened with three languages?' from rediff Top Inte...