Thursday, 28 October 2021

అఖిల్ ‘ఏజెంట్‌’లో మెగాస్టార్ లుక్ లీక్‌.. చూస్తే ఫ్యాన్స్‌కు కిక్కే!

ఈ ఏడాది అక్కినేని న‌ట వార‌సులు అక్కినేని నాగ‌చైత‌న్య‌, అఖిల్‌ల‌కు బాగా క‌లిసొచ్చింది. ల‌వ్‌స్టోరితో నాగ‌చైత‌న్య బ్లాక్బ‌స్ట‌ర్‌ హిట్ వ‌స్తే, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్‌తో అఖిల్ సూప‌ర్ హిట్ కొట్టాడు. అదే ఉత్సాహంతో అఖిల్ ఇప్పుడు నెక్ట్స్ మూవీ స‘ఏజెంట్‌’ కోసం రెడీ అవుతున్నారు. సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌కుడు. ఇది ప‌క్కా యాక్ష‌న్ మూవీగా సినిమాను తెర‌కెక్కిస్తున్నారు. కెరీర్ ప్రారంభంలోనే అఖిల్ చేస్తున్న భారీ బ‌డ్జెట్ మూవీ ఇది. అలాగే ఈ సినిమా కోసం అఖిల్ స‌రికొత్త లుక్‌లో క‌నిపించ‌బోతున్నారు. సిక్స్ ప్యాక్ కూడా పెంచేశాడు. దీనికి సంబంధించిన ఫొటోలు ఇప్ప‌టికే విడుద‌ల‌య్యాయి. ఈ సినిమాలో మ‌లయాళ మెగాస్టార్ మ‌మ్ముట్టి విల‌న్‌గా న‌టించ‌బోతున్నార‌ని వార్త‌లు వినిపించిన సంగ‌తి తెలిసిందే. కానీ ఇప్పుడు మ‌రో వార్త నెట్టింట తెగ హ‌ల్ చ‌ల్ చేస్తోంది. అది కూడా మ‌మ్ముట్టి లుక్ విష‌య‌మై. ఏజెంట్‌లో స్టైలిష్ లుక్‌లో క‌నిపించ‌బోతున్నారంటూ.. ఓ చిన్న వీడియో క‌నిపిస్తోంది. అందు మ‌మ్ముట్టి చాలా స్టైలిష్‌గా, డిఫ‌రెంట్‌గా క‌నిపిస్తున్నారు. ఈ లుక్ అఖిల్ సినిమా ఏజెంట్ కోస‌మేన‌ని, ఇప్పుడు యూనిట్ అంతా యూర‌ప్‌లో బుడాపెస్ట్‌కు చేరుకుంద‌ని అక్క‌డ షూటింగ్ జ‌రుగుతుంద‌ని, ముఖ్యంగా మ‌మ్ముట్టిపై కీల‌క స‌న్నివేశాల‌ను అక్క‌డే చిత్ర‌క‌రిస్తార‌ని వార్త‌లు హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. దాదాపు రెండు వారాల పాటు మ‌మ్ముట్టి ఈ సినిమా కోసం డేట్స్ కేటాయించార‌ని కూడా టాక్ వినిపిస్తోంది. అక్కినేని అఖిల్ ‘ఏజెంట్‌’ సినిమాను సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో ఎ.కె.ఎంట‌ర్‌టైన్మెంట్ బ్యాన‌ర్‌పై అనీల్ సుంక‌ర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ స్పై థ్రిల్ల‌ర్‌లో అఖిల్ జోడీగా సాక్షి వైద్య న‌టిస్తుంది. ఇండియ‌న్ జేమ్స్ బాండ్‌గా అఖిల్‌ను వెండితెర‌పై ఆవిష్క‌రించే ప్ర‌య‌త్నం చేస్తున్నారు ద‌ర్శ‌కుడు సురేంద‌ర్ రెడ్డి. బ‌డ్జెట్ దృష్ట్యా ఈ మూవీని పాన్ ఇండియా రేంజ్లో విడుద‌ల చేస్తారో లేక టాలీవుడ్‌కే ప‌రిమితం చేస్తారో చూడాలి. అఖిల్‌, హ‌లో, మిస్ట‌ర్ మ‌జ్ను చిత్రాలతో హీరోగా మెప్పించినా అక్కినేని అభిమానులు ఆశించిన స్థాయి విజయాన్ని మాత్రం అఖిల్ అందుకోలేక‌పోయారు. అయితే గీతాఆర్ట్స్ 2 బ్యాన‌ర్‌లో చేసిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్‌తో తొలి స‌క్సెస్ అందుకున్న అఖిల్ ఆ స్పీడును కంటిన్యూ చేస్తాడో లేదో తెలియాలంటే కొన్నాళ్లు ఆగాల్సిందే.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3mnO6RS

No comments:

Post a Comment

'I Wanted Waheeda Rehman For Ankur'

'I don't think Waheeda had the confidence that I could pull it off, so she said no.' from rediff Top Interviews https://ift.tt...