Saturday, 30 October 2021

RT70 : నిర్మాత‌గా మారిన ర‌వితేజ‌.. రామాయణంతో మాస్ మ‌హారాజాకు లింకు .. వివాదాల‌కు దారి తీస్తుందా!

మాస్ మ‌హారాజా ర‌వితేజ రెండు వైపులా ప‌దున్న క‌త్తిలా దూసుకెళ్లిపోతున్నారు. ఒక‌వైపు సినిమాలు పూర్తి చేస్తున్నారు.. మ‌రోవైపు కొత్త సినిమాల‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేస్తున్నారు. ఇప్ప‌టికే ఖిలాడి సినిమాను పూర్తి చేసిన ఈ కమ‌ర్షియ‌ల్ స్టార్ హీరో త్రినాథ‌రావు న‌క్కిన ద‌ర్శ‌క‌త్వంలో ధ‌మాకా సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ అల్యూమియం ఫ్యాక్టరీలో జరుగుతోంది. ఈ సినిమాను కూడా చాలా త్వ‌ర‌గా పూర్తి చేసేస్తున్నారు మాస్‌రాజా. ఈ సినిమా కంప్లీట్ కాకుండానే నెక్ట్స్ సినిమాకు ఓకే చెప్పేశారు. 70వ చిత్రాన్ని అధికారికంగా అనౌన్స్ చేశారు. దానికి సంబంధించి ఓ పోస్ట‌ర్‌ను కూడా విడుద‌ల చేశారు. ఈ పోస్ట‌ర్‌ను గ‌మ‌నిస్తే.. ఇందులో హీరోలు వెళ్లిపోరు అనే లైన్ ఉంది. దీనికి త‌గిన‌ట్లు ఆల‌యంపై ఉండే శిల్పాలు.. అందులో మ‌న ఇతిహాసం రామాయ‌ణంను సూచిస్తున్నాయి. అందులో రావణాసురుడు శిల్పం ప్ర‌ముఖంగా క‌నిపిస్తుంది. అంటే రాముడు.. రావ‌ణాసురుడుకి ఈ క‌థ‌కు ఉన్న లింకేంట‌నేది తెలుసుకోవాలంటే వేచి చూడక త‌ప్ప‌దు. ద‌ర్శ‌కుడు సుధీర్ వ‌ర్మ ఈ సినిమాను తెర‌కెక్కిస్తున్నారు. ఈ సినిమా ఫ‌స్ట్ లుక్‌, టైటిల్‌ను న‌వంబ‌ర్ 5న ఉద‌యం 10 గంట‌ల 08 నిమిషాల‌కు విడుద‌ల చేస్తున్నారు. శ్రీకాంత్ విస్సా అందిస్తున్న క‌థ‌, మాట‌లు అందిస్తున్నారు. అభిషేక్ అగ‌ర్వాల్ ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై అభిషేక్ నామా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మూవీ అనౌన్స్‌మెంట్ పోస్ట‌ర్‌ను చూసి ర‌వితేజ ఫ్యాన్స్ సెల‌బ్రేష‌న్స్ చేసుకుంటున్నారు. స‌రికొత్త సినిమాతో మా హీరో సిల్వ‌ర్ స్క్రీన్‌పై సంద‌డి చేయ‌డం ఖాయ‌మ‌ని వారు ఆనందంగా ఉన్నారు. అయితే ఇతిహాసాల‌ను ఆధారంగా చేసుకుని సినిమాల‌ను తెర‌కెక్కించే స‌మ‌యంలో చాలా జాగ్ర‌త్త‌గా ఉండాలి. లేకుంటే వివాదాల‌కు కేరాఫ్‌గా మారిపోతాయి. అయితే ర‌వితేజ ఇలాంటి వివాదాల‌కు దూరంగానే ఉంటారు. మ‌రి రామాయ‌ణంకు, ర‌వితేజ సినిమాకు లింకేంటో తెలుసుకోవాలంటే ఆగ‌క త‌ప్ప‌దు. ఆస‌క్తిక‌ర‌మైన విష‌య‌మేంటే ఈ సినిమాతో రవితేజ నిర్మాత‌గా మారుతున్నారు. సినిమా అనౌన్స్‌మెంట్ పోస్ట‌ర్‌లో ఆర్‌టి టీమ్ వ‌ర్క్స్ అనే పేరుంది. అంటే ఇది ర‌వితేజ టీమ్ వ‌ర్క్స్ అనే నెటిజ‌న్స్ భావిస్తున్నారు. మ‌రి రవితేజ త‌న సినిమాల‌కు మాత్ర‌మే నిర్మాత‌గా ఉంటారా? లేక వేరే టాలెంట్‌ను ఎంక‌రేజ్ చేస్తాడా? అనేది చూడాలి. సాధార‌ణంగా ఎక్స్‌పెరిమెంట‌ల్ సినిమాలంటే క‌మ‌ర్షియ‌ల్ సినిమాల‌కు ర‌వితేజ ప్రాధాన్యం ఇస్తుంటాడు. అందుకు కార‌ణం ఆయ‌నకు ఎక్స్‌పెరిమెంట్స్ మూవీస్ పెద్ద‌గా క‌లిసి రాలేదు. మ‌రి సుధీర్ వ‌ర్మ ఈసారి రవితేజ‌ను డిఫ‌రెంట్‌గా ఎలా ప్రెజెంట్ చేసి మెప్పిస్తారో వేచి చూద్దాం మ‌రి.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3muHXnh

No comments:

Post a Comment

'I Wanted Waheeda Rehman For Ankur'

'I don't think Waheeda had the confidence that I could pull it off, so she said no.' from rediff Top Interviews https://ift.tt...