Sunday 31 October 2021

BalaKrishna : చిరంజీవిపై నిజంగా మీకున్న అభిప్రాయమేంటి?.. మోహన్‌బాబుని ఇరకాటంలో పెట్టిన బాలయ్య

టాలీవుడ్ ప‌రిశ్ర‌మ‌లో సీనియ‌ర్ హీరోలైన మెగాస్టార్ చిరంజీవి, క‌లెక్ష‌న్ కింగ్ మోహన్‌బాబు మ‌ధ్య ఎప్పుడూ ఏదో ఒక గొడ‌వ న‌డుస్తూనే ఉంటుంది. కొన్నిరోజులు స్నేహంగానే ఉంటారు. మ‌రికొన్ని రోజులు ఒక‌రితో ఒక‌రు మాట్లాడుకోరు. రీసెంట్‌గా జ‌రిగిన మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్ ఎన్నిక‌ల గొడ‌వ‌తో చిరంజీవి, మోహ‌న్‌బాబు మ‌ధ్య డైరెక్ట్‌గా మాట‌లు లేవు. దీనిపై మోహ‌న్‌బాబు కొన్నిసార్లైనా స్పందించారు కానీ.. చిరంజీవి త‌న‌కేమీ ప‌ట్ట‌న‌ట్లే ఉన్నారు. ప‌వ‌న్ క‌ళ్యాణ్ స‌హా మెగా కుటుంబ స‌భ్యులు మాత్రం వారిద్ద‌రూ చాలా మంచి స్నేహితుల‌నీ చెప్పేస్తున్నారు. అయితే ఇప్పుడు చిరంజీవితో నీకేం గొడ‌వ‌? అని మ‌రోసారి మ‌రొక‌రు మోహ‌న్‌బాబు డైరెక్ట్‌గా ప్ర‌శ్నించారు. అయితే ఈసారి మోహ‌న్‌బాబు స‌మాధానం చెప్పాల్సిన అవ‌స‌రం ఉంది. ఎందుకంటే అక్క‌డ ప్ర‌శ్న వేసింది నంద‌మూరి బాల‌కృష్ణ‌. చిరంజీవిగారి మీద మీకు నిజంగా ఉన్న అభిప్రాయం ఏంటి? అని బాల‌కృష్ణ మ‌రో ప్ర‌శ్న వేయ‌గానే మోహ‌న్‌బాబు ఏం చెప్పాలా? అని పైకి చూశారు. అవును నిజ‌మే! నంద‌మూరి బాల‌కృష్ణ తొలి డిజిట‌ల్ ఎంట్రీ ఆహాలోని టాక్‌షో అన్‌స్టాప‌బుల్ ద్వారా జ‌రిగింది. బాల‌కృష్ణ అన్‌స్టాప‌బుల్ టాక్ షో.. రొటీన్‌గా మాత్రం ఉండ‌దు. వాడిగా, వేడిగా ఉంటుంద‌న‌డానికి విడుద‌లైన ప్రోమోనే సాక్ష్యం. దీపావ‌ళి సంద‌ర్భంగా న‌వంబ‌ర్ 4న ప్రసారం కాబోతున్న ఈ టాక్‌షోకు తొలి అతిథి మంచు మోహ‌న్‌బాబు ఆయ‌న కొడుకు విష్ణు, కూతురు ల‌క్ష్మీ ప్ర‌స‌న్న‌. ఈ టాక్‌షోలో మోహ‌న్‌బాబుని ఇరుకున పెట్టే ప్ర‌శ్న‌ను సంధించారు బాల‌య్య‌. ఇంత‌కీ ఆ ప్ర‌శ్న దేనిగురించో తెలుసా? చిరంజీవి గురించే. ఇదో ర‌కంగా మోహ‌న్ బాబుని ఇరుకున పెట్టే ప్ర‌శ్నే అయినా ఆయ‌నేమ‌ని చెప్పారో తెలుసుకోవాలంటే మాత్రం.. అన్‌స్టాప‌బుల్ తొలి ఎపిసోడ్ చూసేయాల్సిందే మ‌రి. దీనికి సంబంధించిన ప్రోమో చాలా ఆస‌క్తిక‌రంగా ఉంది. అటు బాల‌య్య‌, ఇటు మోహ‌న్‌బాబు మ‌న‌సు విప్పి చాలా విష‌యాలు మాట్లాడుకున్నారు. వ్య‌క్తిగ‌త ప్ర‌శ్న‌లే కాదు, ప్రొఫెష‌న‌ల్, పొలిటిక‌ల్ ప్ర‌శ్న‌ల‌ను కూడా బాల‌య్య సంధించారు. వాటికి మోహ‌న్‌బాబు త‌న‌దైన రీతిలో స‌మాధానం ఇచ్చారు. సినిమాల‌కే ప‌రిమ‌త‌మైన నంద‌మూరి బాల‌కృష్ణ తొలిసారి డిజిట‌ల్ ఎంట్రీ ఇచ్చారు. అది కూడా తెలుగు ఓటీటీ ఆహా ద్వారా. ఇందులో టాప్ టాలీవుడ్ సెల‌బ్రిటీల ఇంట‌ర్వ్యూల‌ను ఎంతో ఆహ్లాద‌కంగా డీల్ చేశార‌ని ప్రోమో చూస్తేనే అర్థ‌మ‌వుతుంది. ఇంకా లైన్‌లో రానా ద‌గ్గుబాటి, నేచుర‌ల్ స్టార్ నాని, పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్‌, యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ వంటి వారితో బాల‌య్య ఇంట‌ర్వ్యూస్ ఎలా సాగాయ‌నేది త్వ‌ర‌లోనే తెలియ‌నున్నాయి. ఈ టాక్‌షో తొలి సీజ‌న్ పూర్తి చేయ‌డానికి బాల‌య్య‌కు దాదాపు ఐదు కోట్ల రూపాయ‌ల రెమ్యున‌రేష‌న్ ఇచ్చిన‌ట్లు వార్తలు బ‌లంగా వినిపిస్తున్నాయి. అయితే ఇన్నిరోజులు చేసిన ఇంట‌ర్వ్యూస్ ఒక‌టైప్ అయితే బాల‌కృష్ట లేటెస్ట్ టాక్ షో అన్ స్టాప‌బుల్ మాత్రం నెక్ట్స్ రేంజ్ అనే చెప్పాలి.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3BvhytM

No comments:

Post a Comment

'Don't Involve My Family!'

'My weakness is my family, and the people I love.' from rediff Top Interviews https://ift.tt/2lOucDz