Thursday, 28 October 2021

RRR అయితే మాకేంటి? అంటున్న ‘సర్కారువారి పాట’.. రిలీజ్ డేట్‌పై నిర్మాత‌లు క్లారిటీ!

సూప‌ర్‌స్టార్ మ‌హేశ్ హీరోగా ప‌రశురాం పెట్ల ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం ‘స‌ర్కారువారి పాట‌’. కొన్నిరోజులుగా ఈ సినిమా స్పెయిన్‌లో చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుపుకుంటోంది. కీల‌క స‌న్నివేశాలు స‌హా పాట చిత్రీక‌ర‌ణ‌ను పూర్తి చేశారు. దీంతో ఆ షెడ్యూల్ పూర్త‌య్యింది. స్పెయిన్ షెడ్యూల్ పూర్తయ్యింది. ఇక పాటల చిత్రీకరణ మాత్రమే మిగిలింది. రామోజీ ఫిలింసిటీలో పాటలను చిత్రీకరిస్తాం. సినిమా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేయ‌డానికి మ‌రో నెల స‌మ‌యం ప‌డుతుంది. దాంతో సినిమా పూర్త‌వుతుంది. సంక్రాంతి సంద‌ర్భంగా జ‌న‌వ‌రి 13న రావ‌డం ఫిక్స్ అని చిత్ర నిర్మాత‌లు ఫిక్స్ అయ్యి ఉన్నారు. దీంతో కొన్ని రోజుల నుంచి స‌ర్కారువారి పాట వచ్చే ఏడాది సంక్రాంతికి కాకుండా ఏప్రిల్ 28న విడుదలవుతుందని వినిపిస్తున్న వార్త‌ల‌న్నీ రూమ‌ర్స్ అనే తేలాయి. అయితే చిత్ర యూనిట్ దీనిపై నిర్మాత‌లు ఎలా స్పందిస్తారోన‌ని అంద‌రూ ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. మోస్ట్ ప్రెస్టీజియ‌స్ ఆఫ్ ఇండియాగా రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం ‘ ’. ఈ ఏడాది ద‌స‌రాకు విడుద‌ల కావాల్సిన ఈ చిత్రం కోవిడ్ నేప‌థ్యంలో వాయిదాలు ప‌డుతూ వ‌చ్చే ఏడాది సంక్రాంతి సంద‌ర్భంగా జ‌న‌వ‌రి 7న విడుద‌ల అవుతున్న‌ట్లు నిర్మాత‌లు ప్ర‌క‌టించారు. దీంతో అప్ప‌టికే రిలీజ్ డేట్ ఫిక్స్ అయిన మ‌హేశ్ ‘స‌ర్కారువారి పాట‌’..ప‌వ‌న్ క‌ళ్యాణ్ ‘భీమ్లా నాయ‌క్‌’ చిత్రాలు వాయిదా ప‌డుతాయని అనుకున్నారు. కానీ అలాంటిదేమీ లేద‌ని ఇప్పుడు క్లారిటీ వ‌చ్చింది. సంక్రాంతి సీజన్‌లో మూడు నాలుగు భారీ సినిమాల‌కు ఛాన్స్ ఉంటుంది. కాబ‌ట్టి వ‌సూళ్లు విషయంలో కంగారు పడాల్సిన అవ‌స‌రం లేద‌ని నిర్మాత‌లు భావిస్తున్నార‌ని అర్థ‌మ‌వుతుంది. అందుక‌నే సంక్రాంతి రేసులో పాన్ ఇండియా స్టార్‌ప్ర‌భాస్ ‘రాధేశ్యామ్‌’ కూడా ఉంది. ఈ చిత్రం జ‌న‌వ‌రి 14న విడుద‌ల‌వుతుంది. ఇన్ని భారీ చిత్రాలు రాబోయే సంక్రాంతి బాక్సాఫీస్ ద‌గ్గ‌ర పోటీ అంటే బాక్సాఫీస్ క‌లెక్ష‌న్స్‌తో షేక్ కావ‌డం ప‌క్కా అని ట్రేడ్ వ‌ర్గాలు అనుకుంటున్నాయి. మైత్రీ మూవీ మేక‌ర్స్‌, 14 రీల్స్ ప్ల‌స్‌, జీఎంబీ ఎంట‌ర్‌టైన్మెంట్స్ ప‌తాకాల‌పై ‘’ సినిమా నిర్మిత‌మ‌వుతోంది. హీరో తండ్రిని మోసం చేసి విదేశాల‌కు వెళ్లిన విల‌న్‌ను ఇండియాకు రప్పించే కొడుకు పాత్ర‌లో మ‌హేశ్ క‌నిపించ‌బోతున్నారు. కీర్తిసురేశ్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. రీసెంట్‌గా విడులైన టీజ‌ర్‌కు చాలా మంచి స్పంద‌న వ‌చ్చింది. త‌మ‌న్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. మ‌హేశ్ సూప‌ర్ స్టైలిష్ లుక్‌లో క‌నిపించ‌బోతున్నారు. ఈ చిత్రం తర్వాత మహేశ్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే కదా. ఇప్ప‌టికే మ‌హేశ్ కోసం త్రివిక్ర‌మ్ వెయిట్ చేస్తున్నారు. అత‌డు, ఖ‌లేజా త‌ర్వాత వీరి కాంబినేష‌న్‌లో రాబోతున్న చిత్ర‌మిది. స‌ర్కారువారి పాట చిత్రాన్ని వీలైనంత త్వ‌ర‌గా పూర్తి చేయాల‌నేది ప్ర‌స్తుతం మ‌హేశ్ ముందున్న టార్గెట్‌.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3GEZmlc

No comments:

Post a Comment

'I Wanted Waheeda Rehman For Ankur'

'I don't think Waheeda had the confidence that I could pull it off, so she said no.' from rediff Top Interviews https://ift.tt...