Saturday, 30 October 2021

నేను వాటిని ప‌ట్టించుకోలేదు.. ఆలియాభ‌ట్ టార్చ‌ర్ పెట్టింది.. వాళ్ల‌తో ప‌నిచేయడం చాలా ఈజీ..రాజ‌మౌళి సెన్సేష‌న‌ల్ కామెంట్స్‌

ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి త‌న ప్రెస్టీజియ‌స్ మూవీ RRR ప్ర‌మోషన్స్‌లో బిజీగా ఉన్నారు. ఒక‌వైపు మూవీ పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల‌తో త‌ల‌మున‌క‌లై ఉంటూనే పాన్ ఇండియా రేంజ్‌లో త‌న సినిమాను ప్ర‌మోట్ చేసుకోవ‌డంపై కూడా దృష్టి పెట్టారు. రాజమౌళి రీసెంట్‌గా ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో త‌న సినిమా RRR ..ఆలియా గురించి, ఎన్టీఆర్‌, చ‌ర‌ణ్‌, అజ‌య్ దేవ‌గ‌ణ్ స‌హా ఇత‌ర స్టార్స్‌ను డైరెక్ట్ చేయ‌డం గురించి ప‌లు ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాల‌ను ఆయ‌న తెలియ‌జేశారు. ‘‘నేను డైరెక్టర్‌గా న‌టీన‌టులు ఉత్తరాదివారా, ద‌క్షిణాదివారా, హిందీ, త‌మిళ‌, క‌న్న‌డ .. అంటూ వారి మ‌ధ్య హ‌ద్దుల‌ను చూడ‌టం మ‌ర‌చిపోయాను. ఆడియెన్స్ విష‌యంలోనూ అంతే నేను భాషా బేదాలు చూడటం మ‌ర‌చిపోయాను. స్క్రిప్ట్ కూడా అంతే నా స్క్రిప్ట్‌కు భాష‌తో సంబంధం లేకుండా ఏ న‌టుడు అయితే న్యాయం చేస్తాడా? అని ఆలోచించే అప్రోచ్ అవుతాను. అలాగే నేను డైరెక్ట్ చేసిన బాహుబ‌లి కార్డ్‌ను కూడా ఉప‌యోగించుకోను. స్క్రిప్ట్ ప్ర‌కార‌మే ముందుకెళ‌తాను. RRR లో అజ‌య్ దేవ‌గ‌ణ్‌గారు కీల‌క పాత్ర పోషించారు. ఆయ‌న ఈగ హిందీ వెర్ష‌న్ మ‌క్కీకి డ‌బ్బింగ్ చెప్పారు. అప్ప‌టి నుంచి ఆయ‌న‌తో అనుబంధం ఉంది. స్టార్స్‌తో ప‌నిచేయడం నాకు చాలా ఈజీ. వారికి సంబంధించిన వ‌ర్క్ విష‌యంలో వారెంతో ప్రొఫెష‌న‌ల్‌గా ఉంటారు. అజ‌య్ దేవ‌గ‌ణ్‌గారిని తీసుకుంటే, ఆయ‌న షూటింగ్ స‌మ‌యంలో ఎప్పుడూ త‌న వ్యానిటీ వ్యాన్‌లో కూర్చోలేదు. బ‌య‌టే కూర్చుని షాట్ ఎలా వ‌స్తుందో గ‌మ‌నించేవారు. అలాగే న‌న్ను చూస్తుండేవారు. నేనెప్పుడైనా ఆయ‌న్ని చూస్తే లేచి నా ద‌గ్గ‌ర‌కు న‌డుచుకుంటూ వ‌చ్చి నాతో ఏమైనా అవ‌స‌రం ఉందా సార్‌! అని అడిగేవారు. ఇక ఆలియా భ‌ట్ అయితే మ‌మ్మ‌ల్ని టార్చ‌ర్ పెట్టేసింది. త‌న లైన్స్ గురించి, డిక్ష‌న్ గురించి పూర్తిగా తెలుసుకునేది. ఇక ఎన్టీఆర్‌, చ‌ర‌ణ్ రెండు ద‌శాబ్దాలుగా తెలుసు. నాకు మంచి స్నేహితులు, సోద‌ర స‌మానులు. వారితో ప‌నిచేయ‌డం ఎప్పుడూ నాకు క‌ష్ట‌మ‌నిపించ‌లేదు’’ అని తెలిపారు రాజమౌళి. ‘బాహుబ‌లి’ త‌ర్వాత రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న సినిమా కావ‌డంతో ఎంటైర్ ఇండియ‌న్ మూవీ ఇండ‌స్ట్రీ ఆస‌క్తిగా ఎదురుచూస్తుండ‌గా.. టాలీవుడ్ స్టార్ హీరోలైన యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ కాంబినేష‌న్ మూవీ కావ‌డంతో ఇటు మెగా ఫ్యాన్స్‌, అటు నందమూరి ఫ్యాన్స్‌తో పాటు టాలీవుడ్ ప‌రిశ్ర‌మ అంతా ఎదురుచూస్తుంది. అగ్ర న‌టీన‌టులు చేసిన సినిమా కావ‌డంతో సినిమా క‌లెక్ష‌న్స్ ప‌రంగా ఎలాంటి సంచ‌నాల‌కు తెర తీస్తుందోనిన ట్రేడ్ వ‌ర్గాలు ఎదురుచూస్తున్నాయి. ఇంత మందిలో ఆస‌క్తి పెంచుతోన్న ఈ సినిమా వ‌చ్చే ఏడాది సంక్రాంతి సంద‌ర్భంగా జ‌న‌వ‌రి 7న రావ‌డం ప‌క్కా అయ్యింది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3GA7QtJ

No comments:

Post a Comment

'Trump May Expand H-1B Program'

'Trump has signaled that he has changed his stance on the H1B visa from his first term.' from rediff Top Interviews https://ift.tt...