వేసే పంచులు ఎలా ఉంటాయో అందరికీ తెలిసిందే. ట్రెండ్‌కు తగ్గట్టుగా కౌంటర్లు వేస్తుంటారు. నిత్యం జరిగే వాటిపై కౌంటర్లు వేస్తుంటారు. ఎవరైతే సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంటారో అలాంటి వారిపై ఆది కౌంటర్లు వేస్తుంటాడు. అలా గతంలో కత్తి మహేష్, రాకేష్ మాస్టర్, కతర్ పాప, శ్రీరెడ్డి ఇలా కొందరిపై హైపర్ ఆది పంచ్‌లు వేశాడు. అలా ఎవరు ఎప్పుడు ట్రెండ్ అయితే వారి మీద తన స్కిట్లలో వెరైటీ పంచ్‌లు రాసుకుంటాడు. వారిపై సెటైర్లు వేస్తుంటాడు. తాజాగా హైపర్ ఆది కన్ను మీద పడింది. మా ఎన్నికల్లో మంచు విష్ణు చేసిన హడావిడి అంతా కాదు. మీడియాతో మాట్లాడుతూ మంచు విష్ణు చెప్పిన మాటలు, చేసిన అతిపై నెట్టింట్లో లెక్కలేనన్ని మీమ్స్, ట్రోల్స్ వచ్చాయి. ఓ సందర్భంగా నా గురించి పది ఊర్లను దత్తత తీసుకున్నాను.. నేను చెప్పను... మీరే వెళ్లి చూసుకోండి అని అంటాడు.. చెప్పను అన్న తరువాత ఎలా తెలుస్తుంది.. ఎలా వెళ్లి తెలుసుకోవాలి? అంటూ ట్రోల్స్, మీమ్స్ జరిగాయి. ఇక మంచు విష్ణు తన ప్రసంగాల్లో ఎక్కువగా వాడిన పదం అంకుల్. లెట్ దెమ్ నో అంకుల్ అంటూ ఎక్కువగా వాడేశాడు. ఇక టంగుటూరి వీరేహం పకహం అంటూ ఏదేదో మాట్లాడేశాడు. ఇలా మంచు విష్ణు నాడు సోషల్ మీడియాలో ఎదుర్కొన్న ట్రోలింగ్‌లపై తాజాగా హైపర్ ఆది సెటైర్లు వేశాడు. మొత్తానికి దీపావళి ఈవెంట్ రాక ముందే పేలిపోయేలా ఉంది. అన్నీ మీకే తెలిసినట్టు మాట్లాడుతారేంటి? ఇంతకు ముందు ప్రియమణి గారు మా సైడ్ వచ్చి ఏమన్నారంటే.. అని ఆది అనడం.. హా ఏమన్నారు అని రోజా కౌంటర్ వేయడం. ఆదిని రాం ప్రసాద్ అందరూ పట్టుకుని ఉంటే.. లెట్ దెమ్ నో అంకుల్ లెట్ దెమ్ నో.. అంటూ మంచు విష్ణును గుర్తుకు చేశాడు. స్కిట్‌లో గెటప్ శ్రీను అంకుల్ లేడు కాబట్టి సరిపోయింది.. అసలు మీకు స్కిట్ గురించి తెలుసా? మీకు స్క్రిప్ట్ మీద శూన్యం.. ఆ గుడివాడ రహల గురించి తెలుసా? అంటూ కౌంటర్ వేశాడు. బయట నన్ను ఎప్పుడూ ఓ పది మంది పొగుడుతూ ఉంటారు.. అని ఆది అనడం.. ఎవరు అని పక్కనుంచి రాంప్రసాద్ అడగడం.. వాళ్ల పేర్లు నేను చెప్పను.. కావాలంటే మీరు వెళ్లి అడగండి వాళ్లు నా గురించి చెబుతారు అని మరో సెటైర్ వేశాడు. దీపావళి ఈవెంట్ ప్రోమో కింద ఆది వేసిన పంచ్‌లు, మంచు విష్ణును ఆడుకున్న తీరుకు అందరూ నవ్వుకుంటున్నారు. మొత్తానికి మంచు విష్ణు మీద వచ్చిన ట్రోల్స్ మాత్రం ఫుల్లుగానే వైరల్ అయ్యాయన్నమాట. అయితే ఆది పంచులు వేశాడు మరి దాని పర్యావసానం ఎలా ఉంటుందో చూడాలి.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3bplfXm
No comments:
Post a Comment