Thursday, 28 October 2021

అల్లు అర్జున్‌పై బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కామెంట్స్.. ఏ రకంగా చూసినా ఆయన అంటూ క్రేజీగా!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌పై బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ప్రశంసల వర్షం కురిపించారు. ఆయన్ను సూపర్ స్టార్ అంటూ తెగ పొగిడేశారు. మరి ఉన్నట్టుండి కరణ్ జోహార్ దృష్టి అల్లు అర్జున్‌పై ఎందుకు పడినట్లు? అనుకుంటున్నారా.. నిన్న (బుధవారం) జరిగిన '' ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో బన్నీ చేసిన కామెంట్సే ఇందుకు కారణం. నాగ శౌర్య, రీతూవర్మ జంటగా నటించిన 'వరుడు కావలెను' మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌‌కి ముఖ్య అతిథిగా విచ్చేసిన అల్లు అర్జున్ వేదికపై మాట్లాడిన తీరు అందరినీ ఆకట్టుకుంది. ఫ్యాన్స్, ప్రేక్షకులు థియేటర్లకు వచ్చి సినిమాలను ఆదరించాలని కోరిన అల్లు అర్జున్.. టాలీవుడ్‌తో పాటు ఇతర భాషా చిత్రాల విజయాలు కూడా కోరుకున్నారు. ప్రేక్షకులు థియేటర్లకు వస్తేనే సినిమాకు పూర్వవైభవం సంతరించుకుంటుందని అన్నారు. ఈ క్రమంలోనే బాలీవుడ్ మూవీ 'సూర్యవంశి' సినిమాకు యావత్ దక్షిణాది తరఫున శుభాకాంక్షలు తెలిపారు అల్లు అర్జున్. అయితే బన్నీ చేసిన ఈ కామెంట్స్ చూసి 'సూర్యవంశి' చిత్ర నిర్మాత, ప్రముఖ ఫిలిం మేకర్ కరణ్ జోహార్ క్రేజీ రియాక్షన్ ఇచ్చారు. ''ఏ రకంగా చూసినా అల్లు అర్జున్ సూపర్ స్టారే.. మీ ప్రేమకు ధన్యవాదాలు'' అని పేర్కొంటూ ట్వీట్ చేశారు కరణ్ జోహార్. ఈ మేరకు అల్లు అర్జున్ మాట్లాడిన క్లిప్ షేర్ చేశారు. ఆయన చేసిన ఈ పోస్ట్ చూసి బన్నీ ఫ్యాన్స్ ఖుషీ ఖుషీ అవుతున్నారు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ అవుతోంది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3vQC5HX

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....