Wednesday, 27 October 2021

‘రొమాంటిక్’ సీక్రెట్‌..పూరీ జగన్నాథ్ కోసం గెస్ట్ రోల్ చేసిన స్టార్ హీరో!

డైరెక్ట‌ర్ పూరీ జ‌గ‌న్నాథ్ త‌న కొడుకు ఆకాశ్ పూరిని హీరోగా నిల‌బెట్ట‌డానికి త‌న వంతు ప్ర‌య‌త్నాల‌ను మాత్రం గ‌ట్టిగానే చేస్తున్నారు. ఆకాశ్ పూరి హీరోగా న‌టించిన తాజా చిత్రం ‘రొమాంటిక్‌’. అక్టోబ‌ర్ 29న థియేట‌ర్స్‌లో సంద‌డి చేయ‌నుంది. ఈ సినిమాను ఆడియెన్స్‌లోకి తీసుకెళ్ల‌డానికి పూరీ జ‌గ‌న్నాథ్, ఛార్మిలు గ‌ట్టి ప్ర‌మోష‌న్స్ చేస్తున్నారు. ఇప్ప‌టికే ప్ర‌భాస్‌తో టీమ్‌ను ఇంట‌ర్వ్యూ చేశారు. త‌న సినిమాల‌కే పెద్ద‌గా మాట్లాడ‌ని ప్ర‌భాస్‌.. పూరీ జ‌గ‌న్నాథ్ కోసం తొలిసారి యాంక‌ర్‌గా మారారు. అలాగే రౌడీ హీరోగా యూత్‌లో ఇమేజ్ సంపాదించుకున్న విజ‌య్ దేవ‌ర‌కొండ రొమాంటిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో హంగామా చేశారు. ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన మ‌రో సీక్రెట్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఈ సినిమాలో ఓ స్టార్ హీరో త‌న స్టెప్స్‌తో ఆడియెన్స్‌కు ఊపు తెస్తార‌ట‌. ఇంత‌కీ ఆ స్టార్ హీరో ఎవ‌రో తెలుసా? . ఈ యంగ్ అండ్ ఎన‌ర్జిటిక్ హీరోను ఇస్మార్ట్ శంక‌ర్‌గా చూపించారు పూరి. రామ్ కెరీర్‌లోనే ది బెస్ట్ హిట్ మూవీగా నిలవ‌డ‌మే కాకుండా త‌న‌కు మాస్‌లో తిరుగులేని క్రేజ్‌ను తెచ్చి పెట్టింది. రామ్ కొన్ని సెక‌న్స్ పాటు రొమాంటిక్ సినిమాలో క‌నిపిస్తే.. ఆడియెన్స్‌కు క‌నుల విందుగా ఉండ‌ట‌మే కాదు, థియేట‌ర్స్‌కు ఆడియెన్స్ ర‌ప్పించ‌వ‌చ్చున‌నే ఆలోచ‌న‌తో పూరీ జ‌గ‌న్నాథ్ రిక్వెస్ట్ మేర‌కు రామ్, రొమాంటిక్ సినిమాలో గెస్ట్ అప్పియ‌రెన్స్ ఇవ్వ‌డానికి ఒప్పుకున్నార‌ట‌. ఈ సినిమాలో పీ నే కే బాద్‌(తాగిన త‌ర్వాత‌) అనే ప‌బ్ సాంగ్ ఉంది. ఈ లిరిక‌ల్ సాంగ్ కూడా విడుద‌లైంది. ఈ పాట‌లో హీరో రామ్ త‌ళుక్కున మెర‌వ‌బోతున్నార‌ట‌. క‌నిపించ‌డ‌మే కాదండోయ్ స్పెప్పులేసి అద‌ర‌గొట్ట‌బోతున్నార‌ట‌. అలాగే త‌న సినిమాల్లో అలా క‌నిపించే ద‌ర్శ‌కుడు పూరీ జ‌గ‌న్నాథ్ కూడా ఈ పాట‌లో క‌నిపించ‌బోతున్నార‌ని ఇండ‌స్ట్రీ వ‌ర్గాల టాక్‌. ప‌లు చిత్రాల్లో బాల న‌టుడిగా మెప్పించిన ఆకాశ్ పూరి.. మెహ‌బూబాతో హీరోగా మారాడు. కానీ ఆ సినిమా ఆశించిన స్థాయిలో స‌క్సెస్ కాలేదు. ఇప్పుడు ‘రొమాంటిక్‌’ మూవీ స‌క్సెస్‌పై చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాడు. అనిల్ ప‌డూరి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ చిత్రానికి పూరీ జ‌గ‌న్నాథ్‌, ఛార్మి నిర్మాత‌లు. పూరీ జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంల‌ చేయ‌లేదు కానీ.. క‌థ‌, స్క్రీన్‌ప్లే, మాట‌ల‌ను ఆయ‌నే అందించారు. తొలి చిత్రం నిరాశ‌నే మిగిల్చింది. మ‌రి ఈ రొమాంటిక్ ఆకాశ్‌ను హీరోగా ఎంత మేర‌కు నిల‌బెడుతుందో చూడాలి. ఢిల్లీ బ్యూటీ కేతికా శ‌ర్మ ఇందులో హీరోయిన్‌గా న‌టించింది. ప్రేమ‌లో ఉంటూ మెహంలో ఉన్నామ‌నుకునే ఇద్ద‌రి ప్రేమికుల క‌థే ‘రొమాంటిక్‌’.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3vQ0z46

No comments:

Post a Comment

The Manmohan Singh Interview You Must Read

'We are going to need more technical people in government.' from rediff Top Interviews https://ift.tt/CkfAJzb