Thursday, 28 October 2021

పెళ్లిపై నోరు విప్పిన నాగ శౌర్య.. ఏ క్షణంలోనైనా గుడ్ న్యూస్ రావొచ్చా?

యంగ్ హీరో ప్రస్తుతం రీతూ వర్మతో కలిసి అంటూ రాబోతోన్నాడు. అయితే ఈ సారి నాగ శౌర్య హిట్టు కొట్టేలానే కనిపిస్తున్నాడు. వరుడు కావలెను అనే టైటిల్ పెట్టడంతో.. ప్రమోషన్స్‌లో అంతగా కూడా నాగ శౌర్య పెళ్లి గురించి చర్చలు వచ్చాయి. ట్రైలర్ లాంచ్, సాంగ్ లాంచ్ ఈవెంట్‌లోనూ నాగ శౌర్య పెళ్లి హాట్ టాపిక్ అయింది. ఇక ఆ ఈవెంట్లలో లేడీ ఫ్యాన్స్ కొన్ని పర్సనల్ ప్రశ్నలు అడిగారు. పెళ్లికి సంబంధించిన ప్రశ్నలు అడగడంతో నాగ శౌర్య వారిపై సెటైర్లు వేస్తూనే పులిహోర కలిపేశాడు. పెళ్లి ఎప్పుడు అని ఓ అభిమాని అడిగింది. ఆ ప్రశ్నకు నాగ శౌర్య సమాధానం ఇస్తూ.. ఆ ప్రశ్నలోనే ఎన్నో ప్రశ్నలున్నాయి.. మీ పెళ్లా? నా పెళ్లా? మన పెళ్లా? అని తిరిగి ప్రశ్నించాడు. మన పెళ్లే సరి అని అభిమాని సిగ్గుపడితే..పెద్దవాళ్లు చూసుకుంటారు అని కవర్ చేసేశాడు. ఇక సినిమాలో ఉన్నట్టుగా నిజ జీవితంలోనూ డామినేట్ చేసే భార్య వస్తే ఏం చేస్తారు? అని నాగ శౌర్యను మరో ఫ్యాన్ అడిగింది. డామినేట్ చేసే భార్య వస్తే తగ్గుతాను.. కానీ అన్ని సార్లు తగ్గను.. అవసరం ఉన్నప్పుడే తగ్గుతాను.. అన్నీ సార్లు అలా తగ్గితే చేతగాని వాడని అనుకుంటారు అంటూ నాగ శౌర్య తన మనసులోని మాటలు చెప్పేశాడు. అయితే తాజాగా పెళ్లి గురించి తన అభిప్రాయాన్ని చెప్పేశాడు. కల్యాణం వచ్చినా.. కక్కు వచ్చినా ఆగదంటారు. నా పెళ్లి విషయంలో నాకు పెద్దగా ప్లాన్స్‌ ఏమీ లేవు. మనం ఎంత ప్లాన్‌ చేసిన పెళ్లి విషయంలో రాసి పెట్టిందే జరుగుతుంది. వచ్చిన భార్యను బాగా చూసుకోవాలనుకుంటా. తనకు ప్రైవసీ ఇవ్వాలి. ఆమె ఫ్రొషెషన్‌కు గౌరవం ఇవ్వాలి. ఫైనల్‌గా ఆ అమ్మాయిని బాగా చూసుకోవాలి అంతే అంటూ పెళ్లి గురించి నాగ శౌర్య ఓపెన్ అయిపోయాడు. అంటే నాగ శౌర్య పెళ్లి ఏక్షణాన అయినా జరగొచ్చన్న మాట.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3pLxfuo

No comments:

Post a Comment

'Dhurandhar 2 Will Make 2,000 Crores'

Ramgopal Varma: 'Even if they think it's a horrible film, it'll do 2,000 crores'. from rediff Top Interviews https://ift.t...