Sunday, 31 October 2021

కొన్ని సార్లు వదిలేయడమే ముఖ్యం!.. డిప్రెషన్‌లో అలా చేస్తానన్న సమంత

ప్రస్తుతం ఫుల్ జోష్‌లో ఉంది. విడాకుల విషయాన్ని పూర్తిగా పక్కన పెట్టేసినట్టు కనిపిస్తోంది. నాగ చైతన్యకు సంబంధించిన మెమోరీస్‌ను కూడా తన వద్ద ఉంచుకోవడం లేదనిపిస్తోంది. చైతూ ఫోటోలను తన ఇన్ స్టాగ్రాం నుంచి సమంత డిలీట్ చేసేస్తోంది. అయితే సమంత ఇప్పుడు మాత్రం తన స్నేహితులతో కలిసి తెగ ఎంజాయ్ చేస్తోంది. గత వారం అంతా ఛార్ ధామ్ యాత్ర అంటూ తీర్థ యాత్రల్లో మునిగి తేలిసింది. హిమాయలయాలు, పుణ్య క్షేత్రాలు అంటూ దైవ చింతనలో గడపింది. ఈ వారం అంతా కూడా దుబాయ్‌లో దుమ్ములేపేసింది. అయితే సమంత తన ఫ్రెండ్స్ ప్రీతమ్, సాధన సింగ్‌లతో కలిసి దుబాయ్ వీధుల్లో నానా హంగామా చేసింది. ఇంకా అక్కడే ఉన్నట్టు కనిపిస్తోంది. అయితే సమంత తన రూం ఎలా ఉంటుంది..బెడ్రూం ఎంత దారుణంగా ఉంటుందో చూపించింది. అలా చిందరవందరగా ఎక్కడపడితే అక్కడే బట్టలు పడేసి ఉంటాయని సమంత చెప్పేసింది. అలా గందరగోళంగా ఉన్న రూంను ఎంతో నీట్‌గా చేసేశారంటూ ఆర్గనైజ్ విత్ ఈజ్ అనే కంపెనీ గురించి సమంత ప్రమోషన్ చేసింది. ఆర్గనైజ్ విత్ ఈజ్ ఇలా మన రూంను ఎంతో అందంగా చేసేసిందని సమంత చెప్పుకొచ్చింది. మామూలుగా అయితే తనకు ఎప్పుడైనా మూడ్ బాగా లేకపోయినా, డిప్రెషన్‌లా అనిపించినా కూడా బట్టలన్నీ సర్దుకుంటూ క్లీన్ చేసుకుంటుందట. మొత్తానికి సమంత మాత్రం తన రూంను చూపించింది. అందులో బెడ్డు మీద కుప్పలు కుప్పలుగా బట్టలు పడేసి ఉంటే సాధన, ప్రీతమ్, సమంతలు మాత్రం బెడ్డు మీద ముచ్చట్లు పెట్టుకుంటూ ఉన్నారు. కొన్ని సార్లు సర్దడం, అన్నీ కలపడం కంటే అలా వదిలేయడం బెటర్ అన్నట్టుగా ఓ కొటేషన్‌ను సమంత చెప్పుకొచ్చింది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3mstkkf

No comments:

Post a Comment

'3-Language Formula Is A Burden On All Students'

'Why should children, who are already burdened with so many subjects, be over-burdened with three languages?' from rediff Top Inte...