Thursday, 28 October 2021

గోవా బీచ్ ఒడ్డున యువ హీరోతో పాయల్.. షర్ట్ విప్పేసి అలా! ఈ అరాచకం మామూలుగా లేదే..

పంజాబీ పాలకోవా హాట్ అందాల‌ను విందు చేయించ‌డంలో ఎప్పుడూ ముందుంటుంది. అలాగని కేవలం గ్లామ‌ర్‌షోకే ప‌రిమిత‌మా? అంటే లేదు.. ఒక‌వైపు గ్లామ‌ర్ ఒల‌క‌బోస్తూనే మ‌రోవైపు పెర్ఫామెన్స్‌తో ఆక‌ట్టుకోగ‌ల‌దు. ఈ విష‌యం టాలీవుడ్ ప్రేక్ష‌కుల‌కు ఆమె తొలి చిత్రం ‘RX100’తోనే అర్థ‌మైంది. అయితే ఆ సినిమా త‌ర్వాత పాయ‌ల్‌కు వెంకీమామ రూపంలో హిట్ వ‌చ్చినా అది ఆమె ఖాతాలోకి వెళ్ల‌లేదు. కానీ అవ‌కాశాల‌ను అందుకుంటోంది. టాలీవుడ్‌లో త‌న‌దైన గుర్తింపును సంపాదించుకోవ‌డానికి పాయ‌ల్ చాలా హార్డ్ వ‌ర్కే చేస్తుంది. ప్ర‌స్తుతం ఆమె హీరోయిన్‌గా న‌టిస్తోన్న చిత్రం ‘’. హీరో. ఇక్క‌డ ఆది సాయికుమార్ కూడా స‌క్సెస్ కోసం చాలా ఆతృత‌గా ఎదురుచూస్తున్నారు. వీరిద్ద‌రూ క‌లిసి న‌టిస్తున్న చిత్రం తీస్ మార్ ఖాన్ షూటింగ్ ‘తీస్ మార్ ఖాన్‌’. సినిమా ఇప్పుడు గోవాలో షూటింగ్ జ‌రుపుకుంటోంది. ఫైన‌ల్ స్టేజ్‌కు చేరుకుంది. ఇప్పుడు గోవాలో ఓ హాట్ అండ్ రొమాంటిక్ సాంగ్‌ను ఆదిసాయికుమార్‌, పాయ‌ల్ రాజ్‌పుత్‌ల‌పై చిత్రీక‌రిస్తున్నారు. ఈ పాట‌లో ఇద్ద‌రూ రెచ్చిపోయి న‌టించిన‌ట్లు ఫొటోల‌ను చూస్తుంటేనే అర్థ‌మ‌వుతుంది. గోవా బీచ్‌, సముద్ర తీరంలో ష‌ర్ట్ విప్పేసి అలా ప‌డుకున్న ఆది సాయికుమార్ గుండెల‌ను పాయ‌ల్ త‌న పాదంతో తాకుతుంది. మ‌రో ఫొటోలో ఇద్ద‌రూ త‌న్మ‌య‌త్వంలో మునిగిపోయి ద‌గ్గ‌ర‌గా కూర్చున్నారు. ఈ రెండు ఫొటోల‌ను గ‌మ‌నిస్తే.. వారిద్ద‌రి మ‌ధ్య ఉన్న ఇంటెమ‌సి ఏంటనేది అర్థ‌మ‌వుతుంది. అలాగే పాయ‌ల్ త‌న హాట్ గ్లామ‌ర్‌తో అందాల విందు చేయ‌డం పక్కా అని ఫిక్స్ అయిపోవ‌చ్చు. సినిమాకే ఈ పాట హైలైట్ అంటున్నారు. క‌ళ్యాణ్ గోగ‌ణ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. మ‌రి తీస్ మార్ ఖాన్ అటు ఆది సాయికుమార్‌కు, ఇటు పాయ‌ల్ రాజ్‌పుత్‌కు స‌క్సెస్‌ను తెస్తుంద‌నే వారు న‌మ్మ‌కంగా ఉన్నారు. అలాగే పాయ‌ల్ పాత్ర స‌రికొత్త‌గా ఉంటుందంటున్నారు. అంటే, పాయ‌ల్ తొలి చిత్రం RX100 త‌రహాలో ఏమైనా నెగ‌టివ్ ట‌చ్ ఉన్న పాత్ర‌లో క‌నిపించ‌నుందా? అనేది తెలియాల్సి ఉంది. టాలీవుడ్‌లో పాగా వేయ‌డానికి హైద‌రాబాద్‌లోనే ఇల్లు కొనుక్కుందీ బ్యూటీ. ఇక్క‌డ త‌న బాయ్‌ఫ్రెండ్ సౌర‌భ్‌తో క‌లిసి ఉంటోంది. అంతే కాంద‌డోయ్ వీరిద్ద‌రూ క‌లిసి న‌టించ‌బోతున్నార‌ని కూడా టాక్‌. మ‌రి ఇక‌నైనా తెలుగు ప్రొడ్యూసర్ ఈ పంజాబీ కుడియాపై మ‌న‌సు పెట్టి అవ‌కాశాల‌ను అందిస్తారేమో చూడాలి.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2XXETXi

No comments:

Post a Comment

'I Wanted Waheeda Rehman For Ankur'

'I don't think Waheeda had the confidence that I could pull it off, so she said no.' from rediff Top Interviews https://ift.tt...