Wednesday, 27 October 2021

Varudu Kaavalenu : చాలా రోజుల తరువాత చీరకట్టిన హీరోయిన్.. రీతూ వర్మ పరువుతీసిన త్రివిక్రమ్

నాగ శౌర్య, కాంబినేషన్‌లో రాబోతోన్న మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ బుధవారం నాడు జరిగింది. ఈ ఈవెంట్‌కు మాటల మాంత్రికుడు ముఖ్య అతిథిగా విచ్చేశాడు. అలా గెస్టుగా వచ్చిన త్రివిక్రమ్ సినిమా గురించి మాట్లాడేశాడు. అయితే మధ్యలో రీతూ వర్మ గురించి మాట్లాడుతూ.. ఆమె సినిమా టైటిళ్ల మీద సెటైర్లు వేసి పరువుతీశాడు. త్రివిక్రమ్ స్పీచ్ ఆయన మాటల్లోనే.. ‘బన్నీ గారు ఇక్కడికి వచ్చారు. రేపు ఆయన పాట రాబోతోంది. అది ఇప్పటికే నేను విన్నాను. చాలా బాగుంది. వరుడు కావలెను అనే సినిమాను నేను చూశాను. చూసిన వెంటనే నాకు కొంత మంది గుర్తుకు వచ్చారు. డీఓపీ, డైలాగ్ రైటర్స్, డైరెక్టర్, నాగ శౌర్య, రీతూ వర్మ ఇలా అందరూ గుర్తుకు వచ్చారు. చాలా రోజుల తరువాత సినిమా మొత్తం చీరకట్టిన హీరోయిన్‌ను చూశాను. అది నాకు చాలా సంతోషంగా అనిపించింది. నిర్మాత చినబాబు గారు కూడా నన్ను చీరకట్టే హీరోయిన్లు కావాలని అలానే అడుగుతారు. మొత్తానికి చినబాబు గారు ఆయన కోరికను తీర్చుకున్నారు. నేను రీతూ వర్మ సినిమాలను చూశాను. ఆమె మొదటి చిత్రం నుంచి చూసుకుంటే.. పెళ్లి చూపులు, కనులు కనులు దోచాయంటే ఇప్పుడు వరుడు కావలెను. తరువాత షామియానా, కేటరింగ్, లాజిస్టిక్ ఇలా అన్ని రకాల పేర్లు పెడతారేమో. అసలే ఇండస్ట్రీలో సెంటిమెంట్లు ఉంటాయి. ఇక మిగతా వాళ్లు అలాంటి వాటితోనే సినిమాలు నీతోనే తీస్తారు’ అని రీతూ వర్మ సినిమా టైటిళ్ల మీద కౌంటర్లు వేశాడు. దీంతో రీతూ వర్మ తలపట్టుకుని సిగ్గుపడిపోయింది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3nFyPvs

No comments:

Post a Comment

'Child Marriage Is Nothing But Child Rape'

'People don't believe that a 15-year-old girl subjected to sexual intercourse within a marriage is a victim of rape.' from red...