Saturday 30 October 2021

పెళ్లై ఏడాది.. భర్త సీక్రెట్ చెప్పిన చందమామ.. రాత్రి అలా చేస్తాడన్న కాజల్

గత ఏడాది ఈ సమయానికి పరిస్థితులు ఎలా ఉన్నాయో అందరికీ తెలిసిందే. కరోనా దెబ్బకు అందరూ విలవిల్లాడిపోయారు. ఫస్ట్ వేవ్ దెబ్బకు అందరూ కుదేలయ్యారు. కొన్ని కొన్నిరంగాలు అలా పుంజుకోవడం ప్రారంభించాయి. ఎక్కడా ఎక్కువ మంది కలిసి ఈవెంట్లు ఏర్పాటు చేసుకోవడానికి అనుమతులు లేవు. అలాంటి సమయంలోనే తన ప్రేమను బయపెట్టేసింది. తన ప్రేమ గురించి ప్రపంచానికి వింతగా తెలియజేసింది. గౌతమ్ కిచ్లూతో ఎప్పటి నుంచో స్నేహబంధాన్ని కొనసాగిస్తూ వచ్చిన కాజల్ మొత్తానికి లాక్డౌన్ ఎఫెక్ట్‌తో ప్రేమ పీఠల వరకు తెచ్చేసింది. అలా అక్టోబర్ 30న గత ఏడాది ముంబైలో అతి కొద్ది మంది సన్నిహితుల మధ్య కాజల్ పెళ్లి వేడుకలు జరిగాయి.. సెలెబ్రిటీలు ఎవ్వరూ కూడా వెళ్లలేదు. కేవలం సోషల్ మీడియా వేదికగానే శుభాకాంక్షలు అందించారు. అలా కాజల్ గౌతమ్ పెళ్లి నిరాండబరంగానే జరిగినా కూడా వారం రోజులు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యాయి. ఆమె ధరించిన పెళ్లి చీర, వాడిన కాస్ట్యూమ్స్, హనీమూన్ పిక్స్ ఇలా ఎన్నోన్నో విషయాలతో నెట్టింట్లో తెగ హల్చల్ చేసింది. అయితే మొత్తానికి కాజల్ ఇప్పుడు ఫుల్ ఖుషీగా ఉంది. తన పెళ్లై ఏడాది అవుతోంది. వివాహా బంధానికి ఏడాది పూర్తి కావడంతో కాజల్ ఎమోషనల్ అయింది. అలానే భర్తకు సంబంధించిన ఓ సీక్రెట్‌ను బయటపెట్టేసింది. అర్దరాత్రి తన భర్త గునుగుతాడట. నిద్ర లేచే ఉన్నావా? ఇదిగో ఇలా ఈ డాగ్ వీడియో చూడు కాజల్ అని అంటాడట. అలా అనడం తనకు ఎంతో ఇష్టమట. హ్యాపీ వెడ్డింగ్ యానీవర్సరీ అంటూ తన భర్తతో అన్యోన్యంగా ఉన్న ఫోటోను కాజల్ షేర్ చేసింది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2ZBkTdW

No comments:

Post a Comment

'Don't Involve My Family!'

'My weakness is my family, and the people I love.' from rediff Top Interviews https://ift.tt/2lOucDz