Thursday, 28 October 2021

లైఫ్ చాలా చిన్నది.. వీలైనంత వరకు అలాంటి పనులు చేసేయండి.. ప్రియమణి కామెంట్స్ వైరల్

ప్రియమణి.. తెలుగు ప్రేక్షకులకు అస్సలు పరిచయం అక్కర్లేని పేరిది. ఒకానొక సమయంలో టాలీవుడ్ అగ్రహీలందరితో ఆడిపాడి స్టార్ హీరోయిన్‌గా ఫుల్ పాపులర్ అయింది ఈ కన్నడ భామ. 2003 సంవత్సరంలో 'ఎవరే అతగాడు' సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయమై ఆ తర్వాత 'యమ దొంగ' సినిమాతో నేమ్ ఫేమ్ కొట్టేసింది. అలా కొన్నేళ్లపాటు వెండితెరపై హవా నడిపించి ముస్తఫా రాజ్‌ అనే వ్యక్తిని పెళ్లాడింది. పెళ్లి తర్వాత కొంతకాలం సినిమాలకు దూరంగా ఉండి తిరిగి ఇప్పుడిప్పుడే మళ్ళీ కెమెరా ముందుకొస్తోంది. ఇదిలా ఉంటే నేటితరం హీరోయిన్లకు పోటీగా సోషల్ మీడియాలో చేస్తున్న హంగామా అంతాఇంతా కాదు. ఎప్పటికప్పుడు తన కెరీర్‌కు సంబంధించిన వివరాలతో పాటు వ్యక్తిగత వివరాలను షేర్ చేస్తూ అభిమానులతో టచ్‌లో ఉంటోంది. ఈ క్రమంలోనే తాజాగా తన లేటెస్ట్ ఫోటో షూట్ పోస్ట్ చేసిన ఈ అమ్మడు.. దానిపై రాసిన ట్యాగ్ లైన్ పలువురి దృష్టిని లాగేస్తోంది. ''జీవితం చాలా త్వరగా గడిచిపోతోంది. కాబట్టి వీలైనంత వరకు నవ్వండి, కొత్త పనులు నేర్చుకోండి, మనుషులను క్షమించేయండి, పగను వీడండి, గతాన్ని మరిచిపోండి.. ఎప్పుడూ సంతోషంగా ఉండండి'' అంటూ మోటివేషనల్‌ కామెంట్‌ చేసింది ప్రియమణి. ఈ పోస్ట్ చూసిన నెటిజన్స్ బ్యూటిఫుల్, సూపర్ అంటూ ప్రియమణి అందాలను తెగ పొగిడేస్తున్నారు. ఓ వైపు బుల్లితెరపై రాణిస్తూనే రీసెంట్‌గా వెంకటేష్ సరసన 'నారప్ప' సినిమాలో నటించి భేష్ అనిపించుకుంది ప్రియమణి. మరోవైపు వెబ్‌ సిరీస్‌లలోనూ నటిస్తున్న ఆమె వరుస ఆఫర్లను దక్కించుకుంటూ దూసుకుపోతోంది. కెరీర్‌ పరంగా మళ్ళీ బిజీ అవుతోంది. ప్రియమణి నటించిన కొత్త సినిమా విరాటపర్వం అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3pKxXrL

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....