కన్నడ అగ్ర కథానాయకుడు మరణం కన్నడ సినీ ఇండస్ట్రీకి తీరని లోటు. అయితే నటుడిగా, వ్యక్తిగా ఆయన ఓ కన్నడ సినీ రంగానికే పరిమితం కాలేదు. తెలుగు, తమిళ, హిందీ సహా పలు చిత్ర పరిశ్రమలతో ఆయన మంచి స్నేహ బంధాన్ని కొనసాగించారు. పునీత్ ఇక లేరనే వార్త అందరనీ షాక్‌కు గురి చేసింది. శనివారం పునీత్ పార్థివ దేహాన్ని నందమూరి బాలకృష్ణ సందర్శించి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా బాలకృష్ణ తల కొట్టుకుని విధిరాత అంటూ చాలా ఎమోషనల్ అయ్యి కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ క్రమంలో ఆయన అక్కడున్న మీడియాతో మాట్లాడారు. ‘‘పునీత్ రాజ్‌కుమార్‌గారు లేరనే వార్త నమ్మలేని నిజం. వార్త తెలియగానే షాకయ్యాను. ఒకే తల్లికి పుట్టకపోయినా సోదరుల్లాగా కలిసి పోయాం. రెండు కుటుంబాల మధ్య చాలా మంచి స్నేహ బాంధవ్యాలున్నాయి. నాన్నగారు, రాజ్‌కుమార్‌గారు రెండు ఫ్యామిలీల మధ్య అలాంటి అనుబంధాన్ని ఏర్పరిచారు. దేవుడు చాలా అన్యాయం చేశాడు. నటుడిగా ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాదు, సామాజిక సేవా కార్యక్రమాలతో ఎందరికో అండగా నిలబడ్డారు. చనిపోయిన తర్వాత కూడా ఆయన తన కళ్లను దానం చేశారు. అంత మంచి మనసున్న వ్యక్తి. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు లేపాక్షి ఉత్సవాలకు రావాలని కోరితే శివరాజ్‌కుమార్‌గానీ, పునీత్ రాజ్‌కుమార్‌గానీ వచ్చేవారు. ఈరోజు ఆయన మన మధ్య లేరనేది నిజం. అయితే మన గుండెల్లో ఉండిపోతారు’’ అన్నారు బాలకృష్ణ. పునీత్ రాజ్‌కుమార్ టాలీవుడ్ ఇండస్ట్రీతో అందరికంటే ఆయనే ఎక్కువ స్నేహ సంబంధాలను ఏర్పరుచుకున్నారు. ఇక్కడి నుంచి ఏ హీరో బెంగుళూరు వెళ్లినా, పునీత్ వెళ్లి ప్రత్యేకంగా కలిసి మాట్లాడేవారు. అలాంటి వ్యక్తి ఉన్నట్లుండి దూరం కావడాన్ని ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారు. యన్.టి.ఆర్ బయోపిక్ సమయంలో బాలకృష్ణ సినిమా ప్రమోషన్స్‌కు బెంగుళూరు వెళ్లినప్పుడు పునీత్ ఆయన పక్కనే కూర్చున్నారు. బాలకృష్ణ ముఖంపై ఏదో ఉంటే తన ఖర్చీఫ్ తీసుకుని దాన్ని శుభ్రం చేశారు. ఆ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది. పునీత్ రాజ్‌కుమార్ పార్థివ దేహాన్ని కంఠీరవ స్టేడియంలో అక్కడ ప్రజల సందర్శనార్థం ఉంచారు. శనివారం సాయంత్రం అంత్యక్రియలు జరుగుతాయి. ప్రస్తుతం పునీత్ రాజ్‌కుమార్ కుమార్తె అమెరికా నుంచి వస్తున్నారు. ఆమె శనివారం బెంగళూరుకి చేరుకుంటారు. ఆమె తుది చూపు చూసిన తర్వాత పునీత్ రాజ్‌కుమార్ అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో జరుగుతాయి.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3BvSEtT
No comments:
Post a Comment