Friday, 29 October 2021

నిహారిక కొణిదెల కొత్త వెబ్ సిరీస్‌.. సీక్రెట్ రివీల్ చేసిన మెగాడాట‌ర్‌!

హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వ‌క ముందుగానే మెగాడాట‌ర్ నిహారిక ..వెబ్ సిరీస్‌ల‌తో ప్రేక్ష‌కుల‌కు ద‌గ్గ‌రైన సంగ‌తి తెలిసిందే. సినిమాల్లోహీరోయిన్‌గా న‌టిస్తే ల‌క్ క‌లిసి రాలేదు. ఆ త‌ర్వాత ఆమె పెళ్లి చేసుకుని కొన్ని రోజుల పాటు ఇండ‌స్ట్రీకి దూరంగా ఉన్నారు. అయితే ఇప్పుడు మ‌ళ్లీ త‌న ప్రాజెక్ట్స్‌తో బిజీగా మారాల‌ని అనుకుంటున్నారు. అందులో భాగంగానే కొన్ని రోజుల నుంచి ఆమె త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో ఓసీఎఫ్ఎస్ అనే హ్యాష్ ట్యాగ్‌ను జ‌త చేస్తూ పోస్టులు చేస్తున్న సంగ‌తి తెలిసిందే. అస‌లు దీని అర్థ‌మేంటో తెలియ‌క చాలా మంది నెటిజ‌న్స్ నిహారిక‌ను అదేంటో చెప్ప‌మ‌ని కూడా అడిగారు. కానీ ఇన్ని రోజులు నిహారిక వారి ప్ర‌శ్న‌కు స‌మాధానాన్ని దాట వేస్తూ వ‌చ్చింది. అయితే శుక్ర‌వారం ఆమె తండ్రి, న‌టుడు మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఇన్నిరోజులు దాచి పెడుతూ వ‌చ్చిన సీక్రెట్‌ను నిహారిక రివీల్ చేసింది. ఓసీఎఫ్ఎస్ అంటే ఒక చిన్న ఫ్యామిలీ స్టోరి అని తెలియ‌జేస్తూ ఓ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేసింది నిహారిక‌. ఇది తాను నిర్మాత‌గా జీ5 సంస్థ కోసం నిర్మిస్తోన్న వెబ్ సిరీస్ అని కూడా ఈ సంద‌ర్భంగా ఆమె తెలియ‌జేసింది. దానికి సంబంధించిన ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. ఇందులో సంతోశ్ శోభ‌న్‌, సిమ్రాన్ శ‌ర్మ హీరో హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. ఇంకా సీనియ‌ర్ న‌రేశ్‌, తుల‌సి త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ఈ వెబ్ సిరీస్‌లో ఐదు ఎపిసోడ్స్ ఉంటాయి. ఒక్కో ఎపిసోడ్ న‌లబై నిమిషాల వ్య‌వ‌ధితో ఉంటుంది. న‌వంబ‌ర్ 19న ఈ వెబ్ సిరీస్ అందుబాటులోకి రానుంది. అలాగే తండ్రి పుట్టిన‌రోజు సెల‌బ్రేష‌న్స్‌లో భ‌ర్త‌తో పాటు పాల్గొంది. త‌న ఫ్యామిలీ ఫొటోను నిహారిక ఇన్‌స్టాలో షేర్ చేసింది. దీంతో పాటు ఫ్యామిలీయ అనే క్యాప్ష‌న్ కూడా జోడింది. ఇప్పుడీ ఫొటో నెట్టింట తెగ వైర‌ల్ అవుతోంది. పెళ్లికి ముందే ముద్ద‌ప‌ప్పు అవ‌కాయ్‌, నాన్న కూచి వంటి వెబ్ సిరీస్‌లో న‌టించిన నిహారిక ‘ఒక మ‌న‌సు’ చిత్రంతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. తర్వాత సూర్య కాంతం, ఒరు నెల్లనాల్ పాత్తు సొల్రన్ అనే తమిళ సినిమాల్లో హీరోయిన్‌గా న‌టించింది. అయితే హీరోయిన్‌గా మాత్రం అనుకున్న రేంజ్‌లో స‌క్సెస్‌ను అందుకోలేక‌పోయింది. ఈ క్ర‌మంలో ఆమె చైత‌న్య జొన్న‌ల‌గ‌డ్డ‌ను వివాహం చేసుకుని కొన్నిరోజులు పాటు కుటుంబంతో స‌మ‌యాన్ని గ‌డిపారు. ఇప్పుడు మ‌ళ్లీ ఎంట్రీ ఇచ్చారు. మారుతున్న ట్రెండ్‌ను ఫాలో అవుతతూ డిజిట‌ల్ మాధ్య‌మంకు వెబ్ సిరీస్‌ల‌ను నిర్మించడానికి ఆమె సిద్ధ‌మ‌య్యారు. ఇక భ‌విష్య‌త్తులో ఆమె ఎలాంటి ప్రాజెక్ట్స్‌ను రూపొందిస్తుద‌నేది తెలియాలంటే కొన్నాళ్లు ఆగాల్సిందే.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3mzKKM1

No comments:

Post a Comment

'Trump May Expand H-1B Program'

'Trump has signaled that he has changed his stance on the H1B visa from his first term.' from rediff Top Interviews https://ift.tt...