Thursday, 28 October 2021

రొమాంటిక్ మూవీపై రాజమౌళి రివ్యూ.. ఆ మాట చెబితే ముసలోడని అనుకుంటారేమో! క్రేజీ రియాక్షన్

పూరి తనయుడు హీరోగా రూపొందిన కొత్త సినిమా ''. యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. అనిల్ పాదూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా నిర్మాణ బాధ్యతలు దగ్గరుండి చూసుకున్నారు పూరి జగన్నాథ్. ఈ మూవీతో తన తనయుడి ఎలాగైనా ట్రాక్ ఎక్కించాలని బలంగా ఫిక్సయిన పూరి.. చిత్ర ప్రమోషన్స్ విషయంలో స్పెషల్ కేర్ తీసుకుంటున్నారు. రేపు (అక్టోబర్ 29) ఈ సినిమా రిలీజ్ కానున్న నేపథ్యంలో టాలీవుడ్‌కు చెందిన ప్రముఖుల కోసం హైదరాబాద్‌లోని ఓ మాల్‌లో ‘రొమాంటిక్‌’ సినిమా ప్రీమియర్‌ షో వేశారు. ఈ షో చూసిన రాజమౌళి యమ క్రేజీగా రియాక్ట్ అయ్యారు. ''సినిమా ఇప్పుడే చూశాను. ఈ సినిమాలో ఏదన్నా వంక వెతకాలనిపిస్తే.. ముసలోడివై పోయావ్‌.. నీకెం తెలుసు అని యూత్‌ అంతా గొడవ పెడతారేమోనని భయంగా ఉంది. ఇది కంప్లీట్‌ యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌. అనిల్‌ అద్భుతంగా సినిమాను రూపొందించాడు. తన మనసులో ఏదనిపిస్తే అది లెక్కలు వేసుకోకుండా మరీ చిత్రాన్ని రూపొందించాడు. ఆకాష్ చిన్నప్పటి నుంచి సినిమాల్లో నటిస్తున్నాడు. అయితే ఈ సినిమాతో నటనలో ఆకాష్ చాలా పరిణితి చెందాడు. ఈ సినిమా అతడిని మరో మెట్టు పైకెక్కిస్తుంది. ముఖ్యంగా క్లైమాక్స్‌లో తను ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్స్‌ నన్నెంతగానో ఆకట్టుకున్నాయి. మన సినిమా ఇండస్ట్రీకి మరో అద్భుతమైన నటుడు దొరికాడు'' అన్నారు జక్కన్న. పూరీ కనెక్ట్స్ పతాకంపై పూరీ జగన్నాథ్‌, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు సునీల్‌ కశ్యప్‌ సంగీతం అందించారు. రమ్యకృష్ణ పవర్ ఫుల్ పోలీసాఫీసర్‌గా నటించింది. ఆకాష్ సరసన హాట్ బ్యూటీ కేతిక శర్మ హీరోయిన్‌గా నటించింది. ఇప్పటికే విడుదలైన రొమాంటిక్ పోస్టర్స్, టీజర్, ట్రైలర్స్ సినిమాపై ఓ రేంజ్ అంచనాలు క్రియేట్ చేశాయి.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3mubTjr

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....