Sunday, 31 October 2021

Samantha : ‘గే’ కపుల్ పెళ్లి గురించి సమంత పోస్ట్.. ప్ర‌త్యేకంగా స‌మంత ఈ పోస్ట్ చేయ‌డానికి కార‌ణ‌మేంటని గుస‌గుస‌లు?

సమంత తెలిసో తెలియ‌కో అప్ప‌ట్లో వార్తల్లో ఎక్కువ‌గా నిలిచింది. అయితే ఈ మ‌ధ్య భ‌ర్త నాగ‌చైత‌న్య నుంచి విడిపోయిన త‌ర్వాత మాత్రం ఆమె రెగ్యుల‌ర్‌గా వార్త‌ల్లో వ్య‌క్తిగా నిలిచిపోయారు. ఒక‌సారి విడాకుల కార‌ణంగా, మ‌రోసారి త‌న‌పై వ‌స్తున్న వార్త‌ల‌ను ఖండిస్తూ యూ ట్యూబ్ ఛానెల్స్‌పై వేసిన కేసుల కార‌ణంగా..త‌న కొత్త సినిమాల‌ను అనౌన్స్ చేసిన‌ప్పుడు.. ఆధ్యాత్మిక యాత్ర‌ల‌కు వెళ్లిన‌ప్పుడు..ఇలా ఆమె ఏది చేసినా వార్తగానే నిలిచింది. రీసెంట్‌గా ఆమె పోస్ట్ చేసిన మ‌రో పోస్ట్ కూడా ఇప్పుడు నెట్టింట తెగ వైర‌ల్ అవుతుంది. ఇంత‌కీ స‌మంత దేని గురించి పోస్ట్ చేశారో తెలుసా? రీసెంట్‌గా తెలంగాణ‌లో గే క‌పుల్ పెళ్లి చేసుకోబోతున్న‌ట్లు ప్ర‌క‌టించారు. దీనిపై వ‌చ్చిన వార్త ఉన్న పేప‌ర్ క‌టింగ్‌ను స‌మంత త‌న సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేయ‌డం ద్వారా. మామూలుగా అయితే ఈ వార్త‌ను ఏదో కూతూహలం కొద్ది స‌మంత ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశార‌ని అంద‌రూ అనుకోవ‌చ్చు. అయితే విడాకులు త‌ర్వాత ఆమె ఈ పోస్ట్ చేయ‌డంతో అంద‌రూ చెవులు కొరుక్కుంటున్నారు. డివోర్స్ త‌ర్వాత స‌మంత‌పై వ్య‌క్తిగ‌తంగానూ చాలా వార్త‌లు పుట్టుకొచ్చాయి. ఈమె త‌న స్టైలిష్‌తో రిలేష‌న్‌లో ఉంద‌ని కూడా కొంద‌రు మాట‌ల‌న్నారు. అయితే కొంద‌రు ఈ స్టైలిష్ గే కాబ‌ట్టి, స‌మంత ఎలా అత‌నితో రిలేష‌న్ షిప్‌లో ఉంటుంద‌ని కూడా అన్నారు. చివ‌రకు స‌ద‌రు స్టైలిష్ స‌మంతను అక్క అని పిలుస్తాను అంటూ త‌న‌పై వస్తున్న వార్త‌ల‌కు ఘాటు రిప్ల‌య్ ఇచ్చాడు.ఇలా చాలా వార్త‌లు స‌మంత చుట్టూ చ‌క్క‌ర్లు కొట్టాయి. ఈ నేప‌థ్యంలో స‌మంత చేసిన గే క‌పుల్ మ్యారేజ్ న్యూస్ పోస్ట్ వైర‌ల్ అవుతుంది. మ‌రి దీనిపై ఎవ‌రెలా స్పందిస్తారు. ఈ పోస్ట్‌పై ఎలాంటి దుమారం రేగుతుంది. ఎవ‌రెలా స్పందిస్తార‌నేది చూడాలి. ఇక సినిమాల విషయానికి వ‌స్తే.. స‌మంత ప్రొఫెష‌న‌ల్‌గా బిజీగా మార‌డానికి ప్ర‌య‌త్నిస్తున్నారు. అందులో భాగంగానే ఇప్ప‌టికే రెండు సినిమాలు చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. అందులో ఒక‌టి త‌మిళ నిర్మాణ‌ సంస్థ డ్రీమ్ వారియ‌ర్ పిక్చ‌ర్స్‌లో ఎస్‌.ఆర్‌.ప్ర‌కాశ్‌, ఎస్‌.ఆర్‌.ప్ర‌భుల‌తో క‌లిసి శాంత రూబన్ జ్ఞాన‌శేఖ‌ర‌న్ అనే డెబ్యూ డైరెక్ట‌ర్ తెర‌కెక్కించ‌నున్నారు. మ‌రో చిత్రాన్ని హ‌రి, హరీష్ అనే ఇద్దరు డెబ్యూ డైరెక్టర్స్ చేయబోతున్నారు. ఈ రెండు సినిమాలు తెలుగు, త‌మిళ భాష‌ల్లో రూపొంద‌నున్నాయి. అలాగే ఈ రెండు సినిమాల‌ను తెర‌కెక్కిస్తున్న‌ది డెబ్యూ డైరెక్టర్సే కావ‌డం విశేషం. ఇది కాకుండా తెలుగు ఓటీటీ మాధ్య‌మం ఆహాలోనూ ఓ వెబ్ సిరీస్‌లో న‌టించే అవ‌కాశం ఉంద‌ని స‌మాచారం.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3pSOSIK

No comments:

Post a Comment

'Trump May Expand H-1B Program'

'Trump has signaled that he has changed his stance on the H1B visa from his first term.' from rediff Top Interviews https://ift.tt...