Sunday, 31 October 2021

TDP పగ్గాలు చంద్రబాబుకు ఎందుకిచ్చావ్? బాలయ్యకు మోహన్ బాబు సూటి ప్రశ్న.. నటిసింహం షాకింగ్ రియాక్షన్

నందమూరి నటసింహం ట్రాక్ మార్చేశారు. ఇన్నాళ్లు రాజకీయాలు, సినిమాలతో బిజీగా ఉన్న ఆయన, ఇక డిజిటల్ ఎంట్రీ ఇస్తున్నారు. ''అనిపించింది అందాం.. అనుకున్నది చేద్దాం.. ఎవరు ఆపుతారో చూద్దాం'' అని గర్జిస్తూ నేరుగా ఆన్ లైన్ వేదికలపై అడుగు పెడుతున్నారు నటసింహం. 'అన్‌స్టాప‌బుల్‌' అంటూ రంగంలోకి దూకుతున్నారు. ఈ షో తొలి ఎపిసోడ్‌ను మంచు మోహ‌న్‌ బాబు అండ్ ఫ్యామిలీపై చిత్రీక‌రించారు. ఇది దీపావ‌ళి సంద‌ర్భంగా న‌వంబ‌ర్ 4న ప్రసారం కానున్న నేపథ్యంలో తాజాగా ఈ షో ప్రోమో రిలీజ్ చేశారు. కేవలం 3 నిమిషాలతో కట్ చేసిన ఈ వీడియోలో అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ఇప్పటి వరకు ఎప్పుడూ చూడని విధంగా కొత్త అవతారంలో దర్శనమిచ్చారు బాలయ్య బాబు. సీనియర్ హీరోలు బాలకృష్ణ, మధ్య నడిచిన సంభాషణ ఎపిసోడ్‌పై అంతులేని ఆసక్తి నెలకొల్పింది. కామెడీ, కాంట్రవర్సీ కలగలపి సందడి చేశారు ఇద్దరు బడా హీరోలు. అలాగే ఈ ఇద్దరి జీవితాలకు సంబంధించిన సినీ, రాజకీయ విషయాలపై ఎన్నో సీక్రెట్స్ ఈ ఎపిసోడ్‌ ద్వారా తెలుసుకోవచ్చని ప్రోమో చూస్తుంటే స్పష్టమవుతోంది. ఇక ఈ ప్రోమోలో బాలయ్యను కొన్ని విషయాలపై మోహన్ బాబు సూటిగా ప్రశ్నించడం హైలైట్ అయింది. ''తెలుగుదేశం స్థాపించింది అన్న నందమూరి తారక రామారావు గారు. ఆయన తదనంతరం టీడీపీ పార్టీ పగ్గాలు నువ్వు తీసుకోకుండా చంద్రబాబుకు ఎందుకిచ్చావ్? అంటూ సూటిగా బాలయ్యను ప్రశ్నించారు మోహన్ బాబు. దీనిపై ఆ ఒక్కటి అడగొద్దు.. అన్నట్లుగా షాకింగ్ రియాక్షన్ ఇచ్చారు బాలకృష్ణ. ఇలాంటి ఎన్నో ఆసక్తికర సన్నివేశాలతో సాగిపోతున్న ఈ ప్రోమో వీడియో క్షణాల్లో వైరల్ అయింది. రిపీట్ చేసుకొని మరీ చూస్తున్నారు ప్రేక్షకులు. చూస్తుంటే బాలయ్య బాబు హోస్ట్ చేస్తున్న ఈ షో భారీ టీఆర్ఫీలు రాబట్టడం ఖాయమే అని తెలుస్తోంది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3GApkGr

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....