Sunday, 31 October 2021

చెరుకు రసం అమ్ముతున్న సప్తగిరి!.. వీడియోతో అసలు గుట్టు విప్పిన గెటప్ శ్రీను

సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటాడు. తన సినిమాకు సంబంధించిన బాగానే ప్రమోట్ చేసుకుంటాడు. అప్పుడప్పుడు తన అభిమానులతో చిట్ చాట్ చేస్తుంటాడు. లైవ్‌లోకి వచ్చి నెటిజన్లు అడిగే ప్రశ్నలకు సమాధానం ఇస్తుంటాడు. బుల్లితెర, వెండితెరపై గెటప్ శ్రీను ఇప్పుడు ఫుల్ బిజీగా మారిపోయాడు. తన చేతిలో ఐదారు ప్రాజెక్ట్‌లున్నాయి. హీరోగానూ చేస్తూనే మరో వైపు సైడ్ కారెక్టర్లతో దూసుకుపోతోన్నాడు. అలా వెండితెర మీద ఎంత బిజీగా ఉన్న జబర్దస్త్ షోను మాత్రం వదలడం లేదు. తాజాగా గెటప్ శ్రీను ఓ వీడియోను షేర్ చేశాడు. అందులో కమెడియన్, హీరో, నటుడు చెరుకు రసం తయారు చేస్తున్నాడు. రోడ్డు పక్కన ఉన్న చెరుకు బండి వద్ద ఆగారు. శ్రీను, సప్తగిరి ఇద్దరూ కలిసి చెరుకు రసాన్ని తయారు చేసినట్టు కనిపిస్తోంది. ఆ చెరుకు బండి యజమానిని పక్కకు తప్పించినట్టు కనిపిస్తోంది. ఇందులో సప్తగిరి చెరుకు రసాన్ని తయారు చేస్తుండగా.. శ్రీను సాయం చేశాడు. చెరుకు గడలు, అల్లం ముక్కలు అందిస్తూ శ్రీను సాయం చేశాడు. సప్తగిరి చెరుకు రసాన్ని పట్టేస్తున్నాడు. మొత్తానికి చిన్నప్పటి మెమోరీస్ అంటూ గెటప్ శ్రీను ఈ వీడియోను షేర్ చేశాడు. ఇక ఈవీడియో మీద నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు. నాకు తెలుసు ముందే మీరు ఇలాంటి సైడ్ బిజినెస్ పెడతారు అని ఒకడు అంటాడు. అన్నా నాకు ఓ గ్లాస్ ఇవ్వు అని ఇంకొకడు అంటున్నాడు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలని చూపించారు అని ఇంకొకడు అంటాడు. మొత్తానికి ఈ వీడియో మాత్రం నెట్టింట్లో వైరల్ అవుతోంది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3mv5WCz

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....