Sunday, 31 October 2021

hero Nani: త‌న విల‌న్‌కు స‌పోర్ట్‌ చేయడానికి ముందుకొచ్చిన నేచుర‌ల్ స్టార్ నాని!

త‌న విల‌న్‌కు నేచుర‌ల్ స్టార్ స‌పోర్ట్ ఇవ్వ‌టం ఏంటి? అనే సందేహం రాక‌మాన‌దు. ఇంత‌కీ నాని విల‌న్ ఎవ‌రా? అంటే కార్తికేయ‌. కార్తికేయకు నాని ఏవిధంగా స‌పోర్ట్ చేస్తున్నారంటే.. హీరోగా న‌టించిన రాజా విక్ర‌మార్క చిత్రం ట్రైల‌ర్‌ను విడుద‌ల చేయ‌డం ద్వారా. యువ క‌థానాయ‌కుడు కార్తికేయ లేటెస్ట్ మూవీ ‘రాజా విక్ర‌మార్క‌’. యాక్ష‌న్ స్పై థ్రిల్ల‌ర్. ఇప్ప‌టికే విడుద‌లైన ఈ టీజ‌ర్‌కు చాలా మంచి స్పంద‌న వ‌చ్చింది. సినిమాను న‌వంబ‌ర్ 12న విడుద‌ల చేయ‌డానికి నిర్మాత‌లు స‌న్నాహాలు చేస్తున్నారు. న‌వంబ‌ర్ 1న సాయ‌త్రం 4 గంట‌ల 15 నిమిషాల‌కు ట్రైల‌ర్‌ను విడుద‌ల చేయ‌డానికి సిద్ధ‌మ‌య్యారు. ఆస‌క్తిక‌ర‌మైన విష‌య‌మేమంటే ఈ సినిమా ట్రైల‌ర్‌ను నేచుర‌ల్ స్టార్ నాని విడుద‌ల చేయ‌బోతున్నారు. ఇది వ‌ర‌కు నాని హీరోగా న‌టించిన గ్యాంగ్ లీడ‌ర్‌లో కార్తికేయ విల‌న్‌గా న‌టించిన సంగ‌తి తెలిసిందే. ఇలా ఓ అప్‌క‌మింగ్ హీరోకు ఆల్ రెడీ సెటిల్ అయిన హీరో స‌పోర్ట్ చేయ‌డం అనేది అభినందించాల్సిన విష‌య‌మే. ఇప్ప‌టి వ‌ర‌కు కార్తికేయ ప‌క్కా మాస్‌కు, యూత్‌కు క‌నెక్ట్ అయ్యే పాత్ర‌ల‌ను పోషించారు. కానీ తొలిసారి తన రూట్ మార్చి రాజా విక్ర‌మార్క‌తో డిఫ‌రెంట్ అటెంప్ట్ అయితే చేశార‌ని టీజ‌ర్‌తోనే అర్థ‌మైంది. న‌వంబ‌ర్ 1న విడుద‌ల కానున్న ట్రైల‌ర్ ఏ మేర‌కు ఆక‌ట్టుకుంటుంద‌నేది అంద‌రిలో ఆస‌క్తిని పెంచిన విష‌య‌మే. మ‌రోవైపు సినిమా కూడా న‌వంబ‌ర్ 12న విడుద‌ల‌వుతుంది. సాయి శ్రీపల్లి దర్శకత్వం వహించిన ఈ మూవీలో తాన్యా రవిచంద్రన్ హీరోయిన్‌గా న‌టించింది. హ్యాపీడేస్ ఫేమ్ సుధాక‌ర్‌ కోమాకుల కీలకపాత్రలో నటిస్తున్నారు. ఆదిరెడ్డి, 88 రామా రెడ్డి ఈ చిత్రానికి నిర్మాత‌లు. ప్రశాంత్ ఆర్ విహారి సంగీతం అందిస్తున్నారు. తొలి చిత్రం RX 100తో సూప‌ర్ హిట్ కొట్టి ప్రేక్ష‌కుల‌కు ద‌గ్గ‌రైన కార్తికేయ ఆ రేంజ్ హిట్ కోసం ఎదురుచూస్తున్నారు. అలాగే కేవ‌లం హీరోగా న‌టిస్తే స‌రిపోతుంద‌నే ఫీలింగ్ కూడా లేదు. అవ‌కాశం ఉంటే విల‌న్‌గా కూడా న‌టించ‌డానికి ఆయ‌న సిద్ధం. ఎందుకంటే ఇప్ప‌టికే నాని గ్యాంగ్ లీడ‌ర్ చిత్రంలో కార్తికేయ విల‌న్‌గా న‌టించి ఆక‌ట్టుకున్నారు. ఇప్పుడు కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ వ‌లిమై చిత్రంలోనూ కార్తికేయ విల‌న్‌గా న‌టిస్తున్నారు. ఒక‌వైపు న‌చ్చితే గ్రేషేడ్స్ ఉన్న పాత్ర‌లు చేస్తున్న కార్తికేయ హీరోగానూ వైవిధ్య‌మైన సినిమాలు చేస్తూ త‌న మార్క్ క్రియేట్ చేసుకుంటున్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3mqqVGF

No comments:

Post a Comment

'Child Marriage Is Nothing But Child Rape'

'People don't believe that a 15-year-old girl subjected to sexual intercourse within a marriage is a victim of rape.' from red...