Saturday, 30 October 2021

S. S. Rajamouli: ప్రభాస్‌- రాజమౌళి వార్! జనాల్లో ఓ రేంజ్ చర్చలు.. ఈ విషయమై జక్కన్న రియాక్షన్ వైరల్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, దర్శక ధీరుడు రాజామౌళి.. ఇద్దరూ ఇద్దరే. ఎల్లలు దాటిన క్రేజ్ ఈ ఇద్దరి సొంతం. బాహుబలి సిరీస్‌తో యావత్ సినీ ఇండస్ట్రీ ఎప్పటికీ చెప్పుకునే భారీ హిట్ ఇచ్చిన ఘనత ఈ ఇద్దరి సొంతం. ఇద్దరూ కలిశారంటే అదో సంచలనం. మరి అదే ఇద్దరూ విడివిడిగా పోటీకి దిగితే?. మరికొద్ది రోజుల్లో అదే సీన్ చూడబోతున్నాం. వచ్చే జనవరిలో సినిమాతో జక్కన్న బరిలోకి దిగబోతుంటే సినిమాతో ప్రభాస్ రంగంలోకి దూకుతున్నారు. దీంతో ఈ ఇద్దరి 'ఢీ'పై టాలీవుడ్ వర్గాల్లో ఆసక్తికర చర్చలు నడుస్తున్నాయి. అటు తెరకెక్కిస్తున్న భారీ సినిమా RRR, ఇటు ప్రభాస్ హీరోగా నటిస్తున్న 'రాధే శ్యామ్' సినిమాలు చాలాకాలంగా షూటింగ్ జరుపుకుంటున్నాయి. ఎట్టకేలకు ఈ రెండు సినిమాలు జనవరి నెలలోనే, అది కూడా వారం గ్యాప్‌లో రిలీజ్ కానున్న నేపథ్యంలో తెలుగు ప్రేక్షకుల దృష్టి మొత్తం సంక్రాంతిపై పడింది. జనవరి 7వ తేదీన RRR గ్రాండ్ రిలీజ్ ఉండగా, జనవరి 14వ తేదీన ప్రపంచవ్యాప్తంగా 'రాధే శ్యామ్' ప్రేక్షకుల ముందుకొస్తోంది. దీంతో ఈ రెండు సినిమాలు పోటీపడనున్నాయనే టాక్ షురూ అయింది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ ఇష్యూపై దర్శక ధీరుడు రాజమౌళి క్రేజీగా రియాక్ట్ అయ్యారు. RRR, రాధే శ్యామ్ మధ్య గట్టిపోటీ ఉండనుందా? అనే ప్రశ్నపై ఆయన స్పందించారు. సినిమాల మధ్య పోటీ అనేది సహజమని, గతంలో కూడా ఉంది.. ఇప్పుడూ ఉంటుందని జక్కన్న చెప్పారు. అయితే ఎన్ని సినిమాలు విడుదలైనా కంటెంట్‌ బాగుంటే ప్రేక్షకులు అన్ని సినిమాలను ఆదరిస్తారు. కాబట్టి అందులో పోటీ అనుకోవడానికి ఏమీ లేదు. మా సినిమాతో పాటు అన్ని సినిమాలు కూడా బాగా రాణించాలని కోరుకుంటున్నాము అని చెప్పుకొచ్చారు రాజమౌళి.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3w1Ufq0

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....