Friday, 29 October 2021

Puneeth Rajkumar: పునీత్ మరణవార్తతో ఆగిన అభిమాని గుండె

ఫ్యాన్స్‌లో డైహార్డ్ ఫ్యాన్స్ వేరు. త‌మ అభిమాన హీరోను ఎవ‌రైనా ఏమైనా చిన్న మాట అంట‌నే విన‌డానికి ఒప్పుకోరు. వారిపైకి గొడ‌వ‌కెళ‌తారు. కొట్టేసుకుంటారు. వారి ప్ర‌వ‌ర్త‌న చూస్తే అబ్బో త‌న హీరో కోసం చ‌నిపోయేలా ఉన్నాడ‌నేంత ప్రేమ ఉందే అనిపిస్తుంది. కానీ నిజంగానే ఇప్పుడుత‌ను ప్రాణంగా ప్రేమించే హీరో లేడ‌ని తెలియ‌గానే ఓ అభిమాని గుండె ఆగింది. కన్నడ ప‌వ‌ర్‌స్టార్ పునీత్ రాజ్‌కుమార్ మ‌ర‌ణం అభిమానుల‌కు షాక్ ఇచ్చి వారిని శోక సంద్రంలో ముంచేసింది. శుక్ర‌వారం ఉద‌యం గుండెపోటుతో పునీత్ రాజ్‌కుమార్ అకాల మ‌ర‌ణం చెందారు. మ‌ర‌ణ‌వార్త విన్న త‌ర్వాత క‌ర్ణాట‌క ప్ర‌భుత్వం త‌గు చ‌ర్య‌లు తీసుకుంది. థియేట‌ర్స్‌ను మూసి వేసింది. మ‌ద్యపాన విక్ర‌యాల‌పై ఆదివారం వర‌కు ప్ర‌భుత్వం నిషేధం విధించింది. అయితే త‌మ అభిమాన క‌థానాయ‌కుడు ఇక లేర‌నే వార్త‌ను అభిమానులు జీర్ణించుకోలేక‌పోతున్నారు. పునీత్ మర‌ణ‌వార్త విన‌గానే మునియ‌ప్ప‌న్ అనే అభిమాని గుండె ఆగిపోయింది. పొన్నాచ్చి తాలూకాలోని మ‌రూరుకి చెందిన మునియ‌ప్ప‌న్‌కు పునీత్ అంటే ప్రాణం. ఇప్పుడు నిజంగా ఆ ప్రాణ‌మే పోయింది. పునీత్ చ‌నిపోయార‌నే వార్త తెలియ‌గానే మునియ‌ప్ప‌న్‌కు గుండెపోటు వ‌చ్చింది. వెంట‌నే ఆయ‌న్ని ద‌గ్గ‌ర‌లోని హాస్పిట‌ల్‌కు తీసుకెళ్లారు. అయితే అప్ప‌టికే ఆయ‌న చ‌నిపోయిన‌ట్లు డాక్ట‌ర్లు చెప్పారు. మునియ‌ప్ప‌న్‌కు ఏడాది వ‌య‌సున్న పాప ఉంది. రీల్ హీరోగా, రియ‌ల్ హీరోగా ఎంద‌రికో స్ఫూర్తిగా నిలిచి ముందుకు న‌డిపిన వ్య‌క్తి పునీత్ రాజ్ కుమార్‌. ఇలా ఉన్న‌ట్లుండి దూర‌మైపోవ‌డం ఆయన కుటుంబంలోని వ్య‌క్తికే కాదు. సినీ ఇండ‌స్ట్రీకి కూడా తీర‌ని లోటే. పునీత్‌తో అనుబంధం ఉన్న వారెవ‌రైనా ఆయ‌న్ని అంత సులువుగా మ‌ర‌చిపోలేరు. భాష‌తో సంబంధం లేకుండా స్టార్స్‌, టెక్నిషియ‌న్స్ అంద‌రూ పునీత్ రాజ్‌కుమార్ మ‌ర‌ణంపై స్పందించారు. త‌మ సంతాపాల‌ను వ్య‌క్తం చేశారు. శ‌నివారం పునీత్ అంత్య‌క్రియ‌లు జ‌రుగుతాయి. పునీత్ రాజ్‌కుమార్ కుమార్తె అమెరికా నుంచి వ‌స్తున్నారు. బాల‌న‌టుడిగా కెరీర్‌ను ప్రారంభించిన పునీత్‌.. హీరోగా 29 సినిమాల్లో న‌టించారు. చిన్న వ‌య‌సులో బాల‌నటుడిగా జాతీయ అవార్డును అందుకున్నారు పునీత్‌.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3GAs9ah

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....