Wednesday, 27 October 2021

‘రాధేశ్యామ్’కు షాక్.. తగ్గిన యూ ట్యూబ్ వ్యూస్.. రీజన్ అదేనంటూ వివరణ!

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ హీరోగా రూపొందుతోన్న తాజా పాన్ ఇండియా మూవీ ‘రాధేశ్యామ్‌’. రీసెంట్‌గా ఈ సినిమా నుంచి ప్ర‌భాస్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా చిత్ర యూనిట్ టీజీర్‌ను విడుద‌ల చేసింది. అస‌లే రెండున్న‌రేళ్లుగా ప్ర‌భాస్ సినిమా కోసం క‌ళ్లు కాయలు కాచేలా ఎదురుచూసిన ప్ర‌భాస్ టీమ్‌కు ఇది నిజంగా పండగ‌లా అనిపించడంతో టీజ‌ర్ వ్యూస్ ప్ర‌కారం రికార్డ్ వ్యూస్‌ను ద‌క్కించుకుంది. ఇందంతా బాగానే ఉంది. అయితే అనుకోకుండా ఓ చిన్న స‌మ‌స్య వ‌చ్చిపడింది. అదేంటంటే ‘’ యూట్యూబ్ వ్యూస్ ఒక్క‌సారిగా త‌గ్గాయి. ఏదో ఒక‌టో రెండో వ్యూస్ కావు.. ఏకంగా ముందు క‌నిపించిన వ్యూస్ కంటే మిలియన్ వ్యూస్ త‌గ్గాయి. దీంతో ఫ్యాన్స్ అస‌లేం జ‌రుగుతుందంటూ కంగారు ప‌డిపోయారు. ఇక నెటిజ‌న్స్ ఊరుకుంటారా? ‘రాధేశ్యామ్’ విషయంలో యూ ట్యూబ్ టీమ్‌ను సోష‌ల్ మీడియాలో ఏం జ‌రుగుతుందంటూ ప్ర‌శ్నించారు. అందుకు త‌గిన‌ట్లే యూ ట్యూబ్ టీమ్ కూడా అభిమానుల ప్ర‌శ్న‌కు స‌మాధానం ఇచ్చింది. యూ ట్యూబ్‌ను వ్యాలిడేట్ చేశామ‌ని, దాని వ‌ల్ల అప్ప‌టి వ‌ర‌కు ఉన్న వ్యూస్ కాస్త త‌గ్గ‌డం లేదా ఫ్రీజ్ కావ‌డం కానీ జ‌రుగుతాయ‌ని స‌మాధానం ఇచ్చింది. టెక్నిక‌ల్ రీజ‌న్ కావ‌డంతో నెటిజ‌న్స్ శాంతించారు. ‘రాధేశ్యామ్‌’ యూర‌ప్‌లో జ‌రిగే ఓ పీరియాడిక‌ల్ ల‌వ్‌స్టోరి. ప్ర‌భాస్ విక్ర‌మాదిత్య అనే పాత్ర‌లో క‌నిపించ‌నుంటే, పూజా హెగ్డే ప్రేర‌ణ అనే పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నారు. జిల్ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న ఈ చిత్రం సంక్రాంతి సంద‌ర్భంగా వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రి 14న విడుద‌ల‌వుతుంది. దీపావళికి ఈ సినిమా నుంచి మరో టీజర్ విడుదలవుతుందని వార్తలు వినిపిస్తున్నాయి. ‘సాహో’ త‌ర్వాత ప్ర‌భాస్ సినిమా సిల్వ‌ర్ స్క్రీన్‌పై సంద‌డి చేయ‌లేదు. దీంతో అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. కృష్ణంరాజు సమ‌ర్ప‌ణ‌లో కృష్ణంరాజు స‌మ‌ర్ప‌ణ‌లో యువీ క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై వంశీ, ప్ర‌మోద్‌, ప్ర‌శీద ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బాలీవుడ్ నిర్మాణ సంస్థ టి సిరీస్ కూడా ఇంద‌లో భాగ‌స్వామిగా వ్య‌వ‌హ‌రిస్తోంది. ఇప్పుడు వ‌రుస పాన్ ఇండియా సినిమాల‌తో ప్ర‌భాస్ బిజీగా ఉన్నారు. ఇప్ప‌టికే స‌లార్‌, ఆదిపురుష్ సినిమాలు సెట్స్‌పై ఉన్నాయి. మ‌రోవైపు నాగ్ అశ్విన్ ప్రాజెక్ట్ కె, సందీప్ వంగా తెర‌కెక్కించాల్సిన స్పిరిట్ సినిమాలు ప్ర‌భాస్ కోసం వెయిటింగ్‌లో ఉన్నాయి.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3miSnpR

No comments:

Post a Comment

'Child Marriage Is Nothing But Child Rape'

'People don't believe that a 15-year-old girl subjected to sexual intercourse within a marriage is a victim of rape.' from red...