Sunday, 31 October 2021

ఏడుపొస్తోంది.. నా బిడ్డలకు మోసం చేస్తున్నాను.. బాలయ్య ముందు కన్నీళ్లు పెట్టుకున్న మోహన్ బాబు

అదేంటి? మోహ‌న్‌బాబు త‌నేంతో ప్రేమించే త‌న పిల్ల‌ల‌ను మోసం చేస్తున్నారా? అనే సందేహం రాక మాన‌దు. ఈ మాట అన్న‌ది మోహ‌న్‌బాబే. అయితే మాట‌ల‌కు అర్థం సంద‌ర్భాన్ని బ‌ట్టి మారిపోతూ ఉంటుంది. ఇంత‌కీ మోహ‌న్‌బాబు ఏ సంద‌ర్భంలో ఈ మాట చెప్పార‌నే విష‌యం తెలియాలంటే మాత్రం నంద‌మూరి బాల‌కృష్ణ హోస్ట్ చేస్తున్న టాక్ షో అన్‌స్టాప‌బుల్ చూడాల్సిందే. దీపావ‌ళి సంద‌ర్భంగా న‌వంబ‌ర్ 4న అన్‌స్టాప‌బుల్ షో ఆహాలో ప్ర‌సారం కానుంది. దీనికి సంబంధించిన ప్రోమో విడుద‌లైంది. అస‌లు బాల‌కృష్ణ‌తో టాక్ షో అంటే ఎలా ఉండ‌బోతుందోన‌ని అంద‌రూ అనుకున్నారు. కానీ ప్రోమో చూస్తే మాత్రం త‌ప్ప‌కుండా ఇదొక డిఫ‌రెంట్ టాక్ షో అని అర్థ‌మ‌వుతుంది. రొటీన్ టాక్ షోకు బాల‌య్య త‌న‌దైన ఎనర్జీని జోడించారు. మాస్‌, క్లాస్ ఆడియెన్స్‌ను ఆక‌ట్టుకునేలా డైలాగులేశారు. ఇక ప్ర‌శ్న‌ల సంగ‌తి స‌రేస‌రి! అటు మోహ‌న్‌బాబుని, ఇటు బాలకృష్ణ‌ని సినీ జ‌ర్న‌లిస్టులు అడ‌గ‌టానికి సంకోచించే ప్ర‌శ్న‌ల‌కు ఈ టాక్ షో స‌మాధానం చెప్పేస్తుంది. అలాగే ఒక ప‌ర్స‌న‌ల్ క్వ‌శ్చ‌న్ అని బాల‌కృష్ణ అన‌గానే మోహ‌న్‌బాబు విస్కీనా? అని అన్నారు. అప్పుడు బ్యాగ్రౌండ్‌లో ఏక్ పెగ్ లా అనే పాట రావ‌డం ఆక‌ట్టుకుంటుంది. హీరోగా నిల‌బడాల‌నుకుంటున్న‌ప్పుడు విఫ‌ల‌మ‌వుతుండ‌గా ఎప్పుడైనా బాధ‌ప‌డ్డారా? అని బాల‌కృష్ణ అడిగిన ప్ర‌శ్న‌కు మోహ‌న్‌బాబు ఎమోష‌న‌ల్ అయ్యి క‌న్నీళ్లు పెట్టుకున్నారు. . త‌లుచుకుంటే ఏడుపొస్తుంది సోద‌రా!, నా బిడ్డ‌ల‌కు మోసం చేస్తున్నాన‌నిపించింది. ఎందుకంటే నేను ఉన్న ఇల్లు అమ్మేశాను. ఎవ‌రూ స‌హాయం చేయ‌లేదు అని బాధ‌ప‌డ్డారు. అదే స‌మ‌యంలో మోహ‌న్‌బాబు కూడా బాల‌కృష్ణ‌ను కొన్ని ప్ర‌శ్న‌లు వేశారు. ఇక షోలో ల‌క్ష్మి, విష్ణు ఎంట్రీ ఇచ్చారు. మీరు నాన్న‌తో ఈ మ‌ధ్య చెప్పిన అబ‌ద్దాలేంటి? అని ఇద్ద‌రినీ బాల‌కృష్ణ అడిగిన ప్ర‌శ్న‌కు మోహ‌న్‌బాబు మాట్లాడుతూ ల‌క్ష్మి ఈ మ‌ధ్య అబ‌ద్దాలు నేర్చుకుంది కానీ.. విష్ణు అబ‌ద్దాలు చెప్ప‌డు అని అన్నారు. దానికి మీరు అలా అనుకుంటారు డాడో డాడి.. అంటూ ల‌క్ష్మీ మంచు రియాక్ష‌న్ బావుంది. షోలో దంచ‌వే మేన‌త్త కూతురా పాట‌కు బాల‌కృష్ణ‌, ల‌క్ష్మీ మంచు క‌లిసి డాన్స్ చేశారు. అలాగే ల‌క్ష్మీ మంచు జై బాల‌య్య అని ఎన‌ర్జిటిక్‌గా చెప్పింది’’ అన్నారు. ఈ ఎపిసోడ్ కోసం బాల‌య్య త‌న లుక్‌ను పూర్తిగా మార్చేశారు. బాల‌య్య లుక్‌కు సంబంధించిన ఫోటోలు నెట్టింట తెగ వైర‌ల్ అవుతున్నాయి. ఈ షో కోసం బాల‌య్య‌కు భారీ రెమ్యున‌రేష‌న్ ద‌క్కిన‌ట్లు టాక్‌. ఇండ‌స్ట్రీలో వినిపిస్తోన్న వార్త‌ల ప్ర‌కారం దాదాపు ఐదు కోట్ల రూపాయలు బాల‌య్య‌కు ఈ షో కోసం చెల్లించార‌ట‌. దీనికి వ‌చ్చే రెస్పాన్స్‌ను బ‌ట్టి త‌దుపరి సీజ‌న్‌ను ఎప్పుడు చేయాల‌నేది ప్లాన్ చేస్తార‌ని కూడా టాక్ వినిపిస్తోంది. డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ వ‌ర్మ బాల‌కృష్ణ అన్‌స్టాప‌బుల్‌ను చిత్రీక‌రిస్తున్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3bslaC6

No comments:

Post a Comment

'Trump May Expand H-1B Program'

'Trump has signaled that he has changed his stance on the H1B visa from his first term.' from rediff Top Interviews https://ift.tt...