Thursday, 28 October 2021

ఏంది మావ ఇది?.. నెటిజన్ల క్రియేటివిటికీ నిహారిక షాక్.. మొత్తానికి మంచి ప్లానే వేసిందిగా!

మెగా డాటర్ కొణిదెల ప్రస్తుతం వెబ్ సిరీస్‌తో రాబోతోంది. అంటూ రాబోతోన్న ఈ వెబ్ సిరీస్ పేరు ఏంటో గెస్ చేయమని నెటిజన్లకు చాలెంజ్ విసిరింది. OCFS అంటే ఏంటో చెప్పగలరా? అని ఇన్ స్టా స్టోరీలో షేర్ చేసింది. అయితే నెటిజన్లు మాత్రం ఒక్కొక్కరు తమ క్రియేటివిటికి పదును పెట్టేశారు. ఇందులో భాగంగా కొంత మంది క్రేజీగా చెప్పిన సమాధానాలకు నిహారిక రిప్లై ఇచ్చింది. ఒకే కప్ బోర్డులో ఫైవ్ సొక్కాలు అని ఒకడు అంటే.. చెవులు మూసుకుని ఆశ్చర్యపోయిన ఎమోజీని షేర్ చేసింది. ఆన్ లైన్ క్లాస్ ఫర్ స్టూడెంట్స్ అని మరో నెటిజన్ షేర్ చేస్తే చదువు బిడ్డ అని కాంప్లిమెంట్ ఇచ్చింది. ఒక్క చిన్న ఫసక్ స్టోరీ అని మరో నెటిజన్ కామెంట్ చేశారు. వన్ కరోనా ఫ్రీ సోసైటీ అని ఓ నెటిజన్ అన్నారు. అవును ఇప్పుడు ఇది మనకు చాలా అవసరం అని చెప్పింది. ఒక చికెన్ ఫ్రై స్టోరీ అని ఓ నెటిజన్ అన్నారు. లంచ్ టైం అయింది.. నాకు నీ బాధ అర్థమైంది అని నిహారిక కౌంటర్ వేసింది. ఒంటరి చిన్నోడు ఫ్రస్టేటెడ్ సుందరి అని ఓ టైటిల్ చెప్పగా.. నాకు బాగా నచ్చింది అని నిహారిక చెప్పుకొచ్చింది. అవర్ చరణ్స్ ఫిట్ నెస్ సీక్రెట్ అంటూ చెప్పగా.. అవును మనం తెలుసుకోవాలి అని నిహారిక రిప్లై ఇచ్చింది. ఒక కోవిడ్ ఫ్రెండ్ స్టోరీ అని ఇంకో నెటిజన్ రిప్లై ఇవ్వగా.. నహీ అని రిప్లై ఇచ్చింది. వన్ సిండ్రెల్లా ఫ్రమ్ శ్రీకాకుళం అని చెబితే.. బాగుంది అని మెచ్చుకుంది నిహారిక. ఒరేయ్ కెమెరా ఫస్ట్ సూడు అని ఇంకో నెటిజన్ అంటే.. నాకు అర్థం కాలేదు సార్ అని నిహారిక నవ్వేసింది. అవర్ కేఫ్ ఫర్ సింగిల్స్ అని ఒకరు అంటే.. నాకు తెలుసు అది ఎవరికి అవసరమో అని నిహారిక సెటైర్ వేసింది. అవర్ చైతన్య ఫ్రస్ట్రేషన్ స్టోరీ అని అనడంతోనే నిహారిక.. వాడ్.. ఎందుకు అసలు ఎందుకు అని ఖంగారు పడింది. ఇది నీ ఫ్రెండే కదా? అని చైతన్యను ట్యాగ్ చేసింది. ఒన్ చికెన్ ఫిష్ సాంబార్ అని అంటే.. అవును మనకు ఫుడ్డే ఫస్ట్ అని నిహారిక చెప్పుకొచ్చింది. ఓ చెలియా ఫ్రియ సఖియా అని ఒకరు అంటే.. ఎవరు బాబాయ్ నువ్వు అని కౌంటర్ వేసింది. ఆఫీస్‌లో కామ్, ఫ్రెండ్స్‌తో స్టార్మ్ అని ఓ నెటిజన్ రిప్లై ఇచ్చాడు. ఏంది మావా ఇది.. జీ తెలుగు వాళ్లు ఈ క్రియేటివిటీని చూస్తున్నారా? అని నిహారిక షాకైంది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3Bojt31

No comments:

Post a Comment

'3-Language Formula Is A Burden On All Students'

'Why should children, who are already burdened with so many subjects, be over-burdened with three languages?' from rediff Top Inte...