Sunday, 24 October 2021

స్టేజ్ మీదే రీతూ వర్మతో సింగర్ రేవంత్ పులిహోర.. కౌంటర్ వేసిన యాంకర్ గీత

ఒక్కోసారి సింగర్లు, మ్యూజిషియన్లు స్టేజ్ మీద హడావిడి చేస్తుంటారు. హీరో హీరోయన్లను స్టేజ్ మీదకు పిలిచి తెగ హంగామా చేస్తుంటారు. అందులో దేవీ శ్రీ ప్రసాద్ ముందుంటాడు. దేవీ శ్రీ ప్రసాద్ స్టేజ్ ఎక్కితే అంతా అతని కంట్రోల్‌లోకి తీసుకుంటాడు. ఎవ్వరితోనైనా డ్యాన్స్ వేయించగలడు.. పాడించగలడు. అయితే నిన్న సినిమాకు సంబంధించిన సంగీత్ అంటూ ఓ స్పెషల్ ఈవెంట్‌ను నిర్వహించారు. నాగ శౌర్య, కాంబోలో రాబోతోన్న ఈ సినిమా ఈవెంట్‌లో నిన్న కాస్త ఓవర్ యాక్షన్ చేసినట్టు అనిపిస్తుంది. తన పాట ఏదో తాను పాడి వెళ్లకుండా కాస్త ఎక్కువ చేసినట్టు కనిపిస్తోంది. పాట పాడిన అనంతరం దర్శకురాలి దగ్గర పర్మిషన్ తీసుకుని హీరో హీరోయిన్లను స్టేజ్ మీదకు పిలిచేందుకు సింగర్ రేవంత్ ఉత్సాహపడ్డాడు. ఇక వాళ్లు ఎంతసేపటికి రాకపోయే సరికి రేవంత్ కిందకి దిగాడు. నాగ శౌర్య, రీతూ వర్మను తీసుకొచ్చాడు. అయితే స్టేజ్ మీద తాను డ్యాన్సులు వేయను.. సినిమాల్లోనే వేస్తాను అని నాగ శౌర్య చెప్పినట్టు రేవంత్ స్టేజ్ మీద అన్నాడు. ఆ వెంటనే నాగ శౌర్య సైతం అవునని సమాధానం ఇచ్చాడు. అయితే నాగ శౌర్యను డ్యాన్స్ వేయమని పదే పదే అనడంతో చిర్రెత్తుకొచ్చినట్టుంది. నేను వేయను.. నీకు వేయాలనిపిస్తే వేసేయ్ అని రేవంత్‌ను అన్నాడు. అలా అంటేనే ఇలా వెళ్లిపోతారు.. అప్పుడు నేను హీరోయిన్‌తో డ్యాన్స్ చేయోచ్చు అని రేవంత్ తన మనసులోని మాట బయటపెట్టేశాడు. లోపల ఇంత స్కెచ్ ఉందా? అంటూ నోరెళ్లబెట్టింది. అయితే రీతూ వర్మ ముందు నిల్చుని పాట పాడిన రేవంత్‌కు గీత కౌంటర్ వేసింది. ఇది ఇందాకే పాడావ్.. మళ్లీ ఇప్పుడు హీరోయిన్ ముందు ఎందుకు పాడుతున్నావ్? నుమ్ ఆమెను అంతగా చూడాలనుకుంటే థియేటర్లో సినిమా చూడు అని మరో సెటైర్ వేసింది. రేవంత్ పాడుతుంటే.. నాకు ప్రపోజ్ చేసినట్టు అనిపిస్తోందని రీతూ వర్మ కామెంట్ చేసింది. చివరకు రీతూ వర్మ, రేవంత్ కలిసి ఓ రెండు స్టెప్పులు వేశారు. రీతూ వర్మ నాగ శౌర్య పక్కనే బాగుంది.. నీ పక్కన సెట్ అవ్వలేదు అని రేవంత్ పరువుతీసింది యాంకర్ గీత. వాళ్లు నిన్ను అడిగారా? అని రేవంత్ తనకు జరిగిన డ్యామేజ్‌ను కవర్ చేసుకునే ప్రయత్నం చేశాడు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3nrPYZl

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....