దినదినం సోషల్ మీడియా నెట్ వర్క్ పరిధి పెరుగుతూ వస్తోంది. అత్యాధునిక టెక్నాలజీ అందుబాటులోకి వస్తుండటంతో ప్రతి ఒక్కరూ సోషల్ మీడియాలో హావా నడిపిస్తున్నారు. ఇక అదే సోషల్ మీడియాలో యూట్యూబ్ లాంటి ప్లాట్‌ఫామ్స్ డబ్బు సంపాదనకు అవకాశం ఇవ్వడంతో పెద్ద ఎత్తున వెలుస్తున్నాయి. అయితే వీటిలో కొన్ని ఛానల్స్ మాత్రం తప్పుడు పెట్టి వీక్షకులను తప్పుదోవ పట్టించడమే గాక.. నటీనటులను లేనిపోని ఇబ్బందుల్లోకి నెట్టేస్తున్నాయి. తాజాగా ఈ విషయంపై 'మా' అధ్యక్షులు రియాక్ట్ అయ్యారు. తెలుగు ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ సన్మాన కార్యక్రమంలో మీడియాను ఉద్దేశించి మాట్లాడిన 'మా' ప్రెసిడెంట్ మంచు విష్ణు.. హీరోయిన్ల విషయంలో అభ్యంతరకర వీడియోలు పెడితే ఉపేక్షించేది లేదని అన్నారు. కొన్ని యూట్యూబ్ ఛానళ్లు నటుల పట్ల దారుణంగా ప్రవరిస్తున్నాయని చెప్పిన విష్ణు అలాంటి వారిని వెతికి పట్టుకొని కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. యూట్యూబ్ ఛానళ్ల థంబ్‌నైల్స్ హద్దులు మీరుతున్నాయని, అలా అసభ్యకరంగా వ్యవహరించే యూట్యూబ్ ఛానళ్లపై చర్యలు తప్పవని మంచు విష్ణు చెప్పారు. హీరోయిన్స్ అంటే మన ఆడపడుచలని, వారిని గౌరవించాలని విజ్ఞప్తి చేశారు. అలాంటి హీరోయిన్లపై అభ్యంతరకర వీడియోలు పెడితే ఊరుకునేది లేదంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. యూట్యూబ్ ఛానళ్ల నియంత్రణకు, వాటిపై నిఘా పెట్టేందుకు గాను ప్రత్యేక టీమ్ ఏర్పాటు చేసి లీగల్ సెల్ ఏర్పాటు చేస్తామని విష్ణు అన్నారు. ఇప్పటికే ఈ విషయమై యూట్యూబ్‌తో డిస్కస్ చేశామని, ఇలాగ తప్పుగా వ్యవహరించే అన్ని ఛానళ్లపై చర్యలు తీసుకోవడం పక్కా అని అన్నారు. దీనికి తెలుగు మీడియా సహకారం అవసరమని మంచు విష్ణు అన్నారు.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2ZszEPT
No comments:
Post a Comment