Sunday, 24 October 2021

కొత్త ఇంట్లోకి మెహబూబ్.. కల నెరవేరిందంటూ బిగ్ బాస్ కంటెస్టెంట్ ఎమోషనల్

నాల్గో సీజన్ చాలా విచిత్రమైంది. గెలిచిన వాడికి సరైన మూల్యం దక్కలేదు. రన్నర్‌గా వచ్చిన మిగిలింది శూన్యం. కానీ మధ్యలో ఉన్న వాడికి లాభం. ఎప్పుడో ఎలిమినేట్ అయిన వాడికి జాక్ పాట్. అలా ఎన్నెన్నో చిత్ర విచిత్రాలు నాల్గో సీజన్‌లో జరిగింది. ముఖ్య అతిథిగా వచ్చిన చిరంజీవి ఎందుకు ఎమోషనల్ అయ్యాడు.. ఎందుకు చెక్ తీసి ఇచ్చాడు.. నాగార్జున ఎందుకు డబ్బులు ఇస్తాను అన్నాడో వాళ్లకే తెలియాలి. కానీ బిగ్ బాస్ ద్వారా ఎక్కువ డబ్బులు సంపాదించింది మాత్రం సోహెల్. జాక్ పాట్ కొట్టినట్టు ఉత్తి పుణ్యానికే చేతిలో డబ్బులు పడ్డాయి. డబ్బులు వచ్చి చేతిప గుర్తింపు రాలేదు. బిగ్ బాస్ నాల్గో సీజన్ ఫినాలే రోజు.. సోహెల్‌ రూ. 25 లక్షలతో డీల్ కుదుర్చుకున్నాడు. దాంతో అభిజిత్‌కు విన్నర్‌గా దక్కాల్సిన వాటిలో యాభై శాతం కోతపడింది. అయితే సోహెల్ తనకు వచ్చిన దాంట్లో మెహబూబ్‌కు ఐదు లక్షలు ఇస్తాను అని ప్రకటించాడు. దీంతో సోహెల్ మంచి మనసుకు కరిగి చిరంజీవి పది లక్షలు రివర్స్‌లో ఇచ్చాడు. నాగార్జున కూడా అందులో చేయివేశాడు. చివరకు రన్నర్ అయిన అఖిల్‌కు సున్నం పడ్డట్టు అయింది. మొత్తానికి మెహబూబ్ మధ్యలోనే ఎలిమినేట్ అయినా కూడా డబ్బులు మాత్రం సంపాదించాడు. ఇళ్లు కట్టుకునేందుకు సాయం చేయాలని ఇచ్చాను అంటూ సోహెల్ చెప్పుకొచ్చాడు. మొత్తానికి మెహబూబ్ సొంతింటి కల నెరవేరింది. నేడు కొత్తింట్లోకి అడుగుపెట్టినట్టు ప్రకటించాడు. చిన్నప్పటి నుంచి సొంతిళ్లు ఉండాలని, కట్టించాలనే కోరిక తీరిందని ఎమోషనల్ అయ్యాడు. దీనంతటికి తన అభిమానులే కారణమని థ్యాంక్స్ చెప్పుకొచ్చాడు. ఇక మెహబూబ్‌కు ఇప్పుడు మంచి ఆఫర్లు వస్తున్నాయి. సినిమాలు, వెబ్ సిరీస్‌లు అంటూ దాదాపు పది ప్రాజెక్ట్‌లు చేతిలో ఉన్నట్టు తెలుస్తోంది. అందులో ముఖ్యంగా గుంటూరు మిర్చి అంటూ రాబోతోన్న ప్రాజెక్ట్‌తో హీరోగా మారుతున్నాడు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3m92VrB

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....