Saturday, 23 October 2021

HBD Prabhas : ‘రాముడి’కి ‘లక్ష్మణుడు’ అలా.. డార్లింగ్ అంటూ చిరు ఇలా

డార్లింగ్ బర్త్ డే (అక్టోబర్ 23) అంటే సోషల్ మీడియాలో ఏ మాత్రం హవా ఉంటుందో అందరికీ తెలిసిందే. నేటి ఉదయం నుంచి ట్విట్టర్‌లో ప్రభాస్ పేరు మార్మోగిపోతూనే ఉంది. ప్రభాస్ బర్త్ డే సందర్బంగా టాలీవుడ్, బాలీవుడ్ అని తేడా లేకుండా సెలెబ్రిటీలందరూ కూడా విషెస్ అందిస్తున్నారు. రాధేశ్యామ్, ఆది పురుష్, సలార్, ప్రాజెక్ట్ కే, స్పిరిట్ టీం నుంచి స్పెషల్ విషెస్ అందాయి. ఇక ఇప్పుడు తాజాగా మెగాస్టార్ స్పెషల్ ట్వీట్ వేశాడు. ప్రభాస్ ఆన్ స్క్రీన్ తమ్ముడు స్పెషల్ విషెస్ అందించాడు. ఆది పురుష్ సినిమాలో రాముడిగా ప్రభాస్, సీతగా కృతి సనన్, లక్ష్మణుడిగా సన్నీ సింగ్ కనిపించనున్న సంగతి తెలిసిందే. ఇక లంకాధిపతి రావణుడిగా సైఫ్ అలీ ఖాన్ కనిపించనున్నాడు. నేడు ఆది పురుష్ టీం నుంచి ప్రభాస్‌కు స్పెషల్ విషెస్ అందాయి. ఇక తాజాగా తన తమ్ముడు లక్ష్మణ పాత్రధారి సన్నీ సింగ్ వేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. ‘నా పెద్దన్న ప్రభాస్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు. మనం ఇద్దరం కలిసి నటించిన క్షణాలు నాకు ఎప్పటికీ గుర్తుండిపోతాయి.. అది మాటల్లో చెప్పలేని బంధం. ఈ ప్రపంచంలో ఉన్న సంతోషం మొత్తం నీకు రావాల’ని చెప్పుకొచ్చాడు. మరో వైపు మెగాస్టార్ చిరంజీవి వేసిన ట్వీట్, ప్రభాస్‌ను డార్లింగ్ అంటూ సంభోదిస్తూ వేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. ‘హ్యాపీ బర్త్ డే డియర్ ప్రభాస్.. నీకు ఈ ఏడాది ఎంతో అద్భుతంగా ఉండాలి’ అని ట్వీట్ వేస్తూ డార్లింగ్ అని కోట్స్‌లో పెట్టేశాడు. ఇక టాలీవుడ్ నుంచి ఇప్పటికే వెంకటేష్, మహేష్ బాబు, అనిల్ రావిపూడి, గోపీచంద్ మలినేని, సత్యదేవ్, నవీన్ పొలిశెట్టి, ప్రముఖ నిర్మాణ సంస్థలు అన్నీ కూడా ప్రభాస్‌కు విషెస్ చెప్పాయి.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3Ec0eeK

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....