Saturday, 23 October 2021

HBD Prabhas : స్వీటీ స్వీట్ విషెస్.. షాక్ ఇచ్చిన ఆదిపురుష్ టీం

డార్లింగ్ బర్త్ డే అంటే ఒకరి విషెస్ కోసం తెలుగు సినీ ప్రేక్షకులు ఎదురుచూస్తుంటారు. ప్రభాస్ బర్త్ డే సందర్బంగా శెట్టి ఎలా విష్ చేస్తుంది? అసలు చేస్తుందా? లేదా? చేస్తే ఏమని చెబుతుంది? ఇలా రకరకాలుగా జనాలు ఎదురుచూస్తుంటారు. అలా ఈ సారి ప్రభాస్ బర్త్ డే సందర్బంగా అనుష్క స్పెషల్ పోస్ట్ వేసింది. ఇందులో ప్రభాస్ గురించి గొప్పగా చెప్పింది. ప్రభాస్ మీద వేసిన ఈ పోస్ట్ కింద కామెంట్లతో అభిమానులు దుమ్ములేపుతున్నారు. మళ్లీ ఈ పోస్ట్‌తో నెట్టింట్లో పెళ్లిగోల మొదలైంది. స్వీట్ అందించిన ఈ స్వీట్ విషెస్ చూసి డార్లింగ్ అభిమానులు తెగ సంబరపడిపోతోన్నారు. హ్యాపీ బర్త్ డే.. నీకు జీవితంలో అన్నీ శుభాలే కలగాలి సంతోషంగా ఉండాలి.. నువ్ చేసే సినిమాలు, నీ కథలు ఈ ప్రపంచంలోని అందరి హృదయాలకు చేరుకోవాలి.. ఎల్లప్పుడూ ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను అని చెప్పేసింది. దీంతో డార్లింగ్ ఫ్యాన్స్ అనుష్క మీద ప్రేమను కురిపిస్తున్నారు. మీ ఇద్దరి జోడి బాగుంటుంది.. పెళ్లి చేసుకోండి. అంటూ అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. ఇక ఈ ఇద్దరూ కలిసి చేసిన సినిమాలు, వాటిలోని స్టిల్స్‌తో అభిమానులు హల్చల్ చేస్తున్నారు. ఇక మరో వైపు ఆది పురుష్ టీం డార్లింగ్ ఫ్యాన్స్‌కు షాక్ ఇచ్చింది. స్పెషల్ పోస్టర్, ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తారని అనుకుంటే.. సింపుల్‌గా బర్త్ డే విషెస్ చెప్పింది. దాంతో ఓ పోస్టర్‌ను వదిలింది. అందులో ప్రభాస్ మొహాన్ని బ్లర్ చేసింది. దీంతో అభిమానులు హర్ట్ అయ్యారు. ప్రభాస్‌కు నేషనల్ వైడ్‌గా విషెస్ వెల్లువెత్తున్నాయి. మన టాలీవుడ్ నుంచి ఇప్పటికే వెంకటేష్, నవీన్ పొలిశెట్టి, సత్య దేవ్, అనిల్ రావిపూడి, గోపీచంద్ మలినేని, ఓం రావత్, వైజయంతీ మూవీస్ ఇలా అందరూ విషెస్ చెప్పేశారు. ఇంకా ఎంతో మంది సెలెబ్రిటీలు ట్వీట్ల వర్షాన్ని కురిపిస్తున్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3m5Lk3y

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....