Friday, 22 October 2021

సర్కారు వారి పాట అట్రాక్టివ్ ట్యూన్.. తాజా అప్‌డేట్‌తో మహేష్ ఫ్యాన్స్‌ని హుషారెత్తించిన తమన్

సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న 'సర్కారు వారి పాట' వరుస అప్‌డేట్స్ ఈ సినిమాపై మరింత క్యూరియాసిటీ పెంచేస్తున్నాయి. టైటిల్ లుక్ మొదలుకొని పోస్టర్స్, టీజర్ ప్రేక్షకుల నుంచి విశేష స్పందన తెచ్చుకోగా.. తాజాగా అట్రాక్టివ్ ట్యూన్ వినిపిస్తూ ఆసక్తికర అప్‌డేట్ ఇచ్చారు మ్యూజిక్ డైరెక్టర్ . 'సర్కారు వారి పాట' ట్యూన్ కంపోజ్ చేస్తున్న వీడియోను ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు తమన్. ఈ ట్యూన్ యమ అట్రాక్టివ్‌గా ఉంది. తమన్ కంపోజ్ చేసిన ఈ ట్యూన్ వింటుంటే కొత్తగా ఉండటమే గాక గతంలో ఆయన మ్యూజిక్ క్రియేట్ చేసిన సెన్సేషన్స్ తిరగరాస్తుందని అనిపిస్తోంది. ఇది చూసి మహేష్ అభిమానుల్లో ఫస్ట్ సాంగ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అనే ఆతృత రెట్టింపయింది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ స్పెయిన్‌లో జరుగుతోంది. హీరోహీరోయిన్లతో పాటు చిత్ర ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలను అక్కడ షూట్ చేస్తున్నారు. దీపావళి పండుగ కానుకగా ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ కానుందని సమాచారం. దానికి సంబంధించిన ట్యూన్‌నే తమన్ పోస్ట్ చేసి పాట పట్ల ఆసక్తి పెంచేశారు. మహేష్ బాబు కెరీర్‌లో 27వ సినిమాగా రాబోతున్న ఈ 'సర్కారు వారి పాట' సినిమాను భారీ బడ్జెట్ కేటాయించి మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జి.మహేష్ బాబు ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. చిత్రంలో మహేష్ సరసన కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తోంది. సుబ్బరాజు, వెన్నెల కిషోర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. తమన్ బాణీలు కడుతున్నారు. 2022 సంక్రాంతి కానుకగా జనవరి 13వ తేదీన ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3prxefa

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....