Wednesday, 20 October 2021

అనుపమ ఇప్పుడు పెద్దదైంది!.. పిల్లాడినంటూ విజయ్ దేవరకొండ కొంటె కామెంట్లు

కెరీర్ ఎలా మొదలైందో అందరికీ తెలిసిందే. ప్రేమమ్ సినిమాతో మళయాలంలో హిట్ కొట్టేసింది. మేరీ పాత్రలో అనుపమ స్కూల్ పాపలా అదరగొట్టేసింది. అదే పాత్రను తెలుగు రీమేక్‌లోనూ పోషించింది. అలా నాగ చైతన్య పక్కన అనుపమ నటించింది. తెలుగు ప్రేమమ్‌లోనూ అనుపమ అదే మ్యాజిక్‌ను క్రియేట్ చేసింది. అయితే నాటి రోజులను ఇప్పుడు గుర్తుకు చేశారు. ఆమె అలా చేసినప్పుడు నేను ఇంకా చిన్న పిల్లాడినే అంటూ కొంటె కామెంట్లు చేశాడు విజయ్ దేవరకొండ. తాజాగా అనుపమ్, ఆశీష్ కాంబోలో రాబోతోన్న సినిమాలోని ప్రేమే ఆకాశం అనే సాంగ్ లాంచ్ జరిగింది. ఈ ఈవెంట్‌లో విజయ్ దేవరకొండ ముఖ్య అతిథిగా విచ్చేశాడు. విజయ్ చేతుల మీదుగా ఆ సాంగ్ లాంచ్ అయింది. ఇక స్టేజ్ మీద విజయ్ దేవరకొండ మాట్లాడుతూ అనుపమ పరువు తీసేశాడు. అనుపమను చూస్తే ఇంకా చిన్న పిల్లాలనే ఉందని అన్నాడు. ప్రేమమ్‌లో మేరీని చూసినట్టు అనిపిసస్తోందని అన్నాడు. కానీ ఆమె ఇప్పుడు ఎదిగింది. మహిళగా మారింది. చరణ్ అన్న కూడా అలానే అన్నాడట. కానీ ఆమె ప్రేమమ్ చేసినప్పుడు మేమంతా చిన్నపిల్లలమని విజయ్ దేవరకొండ సెటైర్ వేసేశాడు. ఇక ఇదే స్టేజ్ మీద దిల్ రాజుతో అదిరిపోయే సినిమా చేయబోతోన్నట్టు ప్రకటించాడు. ఓ నటుడిగా ఇండస్ట్రీలో ఎన్ని కష్టాలుంటాయో తనకు తెలుసుని, ఎక్కడో నిజామాబాద్ నుంచి వచ్చి దిల్ రాజు ఈ స్థాయికి చేరడం అంటే మామూలు విషయం కాదని అన్నాడు. ‘అలాంటి వారి దగ్గర, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ మీద ఏదో ఒక చిన్న పాత్ర దొరికినా చాలు అని అనుకున్నాను. కేరింత సినిమాకు ఆడిషన్ ఇచ్చాను. కానీ వర్కవుట్ అవ్వలేదు. పెళ్లి చూపులు సినిమా విడుదలచేసేందుకు ఎవ్వరూ దొరకలేదు. దిల్ రాజుకు చూపిద్దామని అనుకున్నాం. కానీ ఆయన అప్పుడు బిజీగా ఉన్నారు. కానీ ఇప్పుడు మేం సరైన సబ్జెక్ కోసం చూస్తున్నాం.గట్టిగా దింపుతామ’ని విజయ్ అన్నాడు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3vt1XJM

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....