Thursday, 21 October 2021

ఆ ఇద్దరే లేకపోతే నాగబాబు నథింగ్.. మెగా బ్రదర్‌పై కోట శ్రీనివాస రావు సంచలన కామెంట్స్

సీనియర్ నటులు ఈ మధ్యకాలంలో సినీ ఇండీస్ట్రీలో చాలా విషయాలపై రియాక్ట్ అవుతూ వార్తల్లో నిలుస్తున్నారు. పలువురు నటీనటులపై ఆయన చేస్తున్న కామెంట్స్ టాలీవుడ్‌లో హాట్ టాపిక్ అవుతున్నాయి. రీసెంట్‌గా యాంకర్ అనసూయ డ్రెస్సింగ్‌ విషయమై కోట చేసిన కామెంట్స్ సెన్సేషన్ అయ్యాయి. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన కోట శ్రీనివాస రావు.. మెగా బ్రదర్‌ నాగబాబుపై సంచలన కామెంట్స్ చేశారు. మొన్నటికి మొన్న ‘మా’ ఎన్నికల సమయంలో తెలుగు వాళ్లకు మాత్రమే మా అసోసియేషన్ పీఠంపై కూర్చునే హక్కు ఉందని చెబుతూ సంచలనం సృష్టించారు కోట. అంతటితో ఆగక ప్రకాష్ రాజ్ ఏ రోజు షూటింగ్‌కు టైమ్‌కు రాలేదంటూ కామెంట్స్ చేయడంతో ఈ వ్యాఖ్యలను తప్పుబట్టారు. కోట ఏజ్ పెరిగినా మాట తీరు మారడం లేదన్నట్లుగా కౌంటర్స్ వేశారు. దీంతో ఈ ఇష్యూ టాలీవుడ్‌లో హాట్ టాపిక్ అయింది. చివరకు మంచు విష్ణు 'మా' అధ్యక్ష పీఠం దక్కించుకున్నారు. ఈ పరిస్థితుల నడుమ ఓ యూ ట్యూబ్ ఛానల్‌తో మాట్లాడిన కోట.. నాగబాబుపై ఓ రేంజ్‌లో కామెంట్స్ చేశారు. ఒక్క మెగా బ్రదర్ అనే గుర్తింపు తప్ప ఆయన కంటూ ఓ స్థానమే లేదన్నారు కోట. అన్నయ్య , తమ్ముడు లేకపోతే నాగబాబు నథింగ్ అంటూ గాలి తీసేశారు. దీంతో ఈ ఇంటర్వ్యూ వీడియో వైరల్‌గా మారింది. కోట శ్రీనివాస రావు చేసిన ఈ వ్యాఖ్యలపై నాగబాబు రియాక్ట్ అవుతారా? లేక లైట్ తీసుకుంటారా చూడాలి మరి!.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2Za8uNP

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....