Saturday, 23 October 2021

ఊహించిన దాన్ని మించి..! షూటింగ్‌ చేస్తుండగా పూరి ఆ మాట అనేవారు.. ఛార్మి ఓపెన్

హీరోయిన్‌గా ప్రేక్షకులకు పరిచయమై ప్రస్తుతం నిర్మాతగా రాణిస్తోంది కౌర్. కెమెరా ముందు గ్లామర్ ట్రీట్ ఇస్తూ తెలుగు ఆడియన్స్‌కి కొత్త టేస్ట్ చూపించిన ఈ బ్యూటీ.. ఇప్పుడు కెమెరా వెనుక కాసుల పంట పండిస్తోంది. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్‌తో బిజినెస్ పార్ట్నర్‌గా చేరి పూరి కనెక్ట్స్ బ్యానర్ సినిమాలు నిర్మిస్తోంది. ఈ బ్యానర్‌లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సూపర్ డూపర్ హిట్ కావడంతో అదే జోష్‌లో వరుస సినిమాలు చేస్తున్నారు పూరి- ఛార్మి. ఈ నేసథ్యంలోనే రౌడీ స్టార్ విజయ్ దేవరకొండతో 'లైగర్' అనే భారీ సినిమా రూపొందిస్తున్నారు. పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను బాలీవుడ్ భారీ నిర్మాణ సంస్థ ధర్మ ప్రొడక్షన్స్‌, పూరి కనెక్ట్స్ సంయుక్త సమర్పణలో తెరకెక్కిస్తున్నారు. సరసన బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ కంప్లీట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఓ మీడియాతో మాట్లాడిన ఛార్మి ఈ మూవీ అవుట్‌పుట్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ‘లైగర్‌’ సినిమా కోసం చాలామంది ఎదురుచూస్తున్నారని చెప్పిన ఛార్మి, వాళ్ళందరూ ఊహిస్తున్న దానికన్నా మించి ఈ సినిమా ఉంటుందని చెప్పింది. ఈ సినిమా ఒక ధమాకా అంటూ విజయ్‌ నటన వేరే స్థాయిలో ఉంటుందని చెప్పుకొచ్చింది. మూవీ షూటింగ్‌ సమయంలో కొన్నిసార్లు పూరీగారు షాట్‌ అయిన వెంటనే ‘కిక్‌ ఇచ్చావు రాజా!’ అనేవారని, అలాగే విడుదల తర్వాత కూడా ఈ మూవీ ప్రతి ఒక్కరికీ కిక్కివ్వడం ఖాయం అని ఛార్మి తెలిపింది. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న లైగర్ మూవీని ముంబై బ్యాక్ డ్రాప్‌లో నిర్మిస్తున్నారు. ముంబై, గోవా తదితర ప్రాంతాల్లోని అందమైన లొకేషన్స్‌లో చిత్రీకరణ జరుపుతున్నారు. ఇప్పటివరకు వదిలిన అప్‌డేట్స్ సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేశాయి.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3GfYbbK

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....