Sunday, 24 October 2021

పెళ్లి తర్వాత కాజల్ అగర్వాల్ హవా.. ఆమె అభిమానులకు గుడ్ న్యూస్! పెద్దదైన చందమామ ఫ్యామిలీ

టాలీవుడ్ చందమామగా సత్తా చాటుతోంది. పెళ్లి తర్వాత కూడా అదే హవా నడిపిస్తూ తన ఫాలోయింగ్ రెట్టింపు చేసుకుంటోంది. ‘లక్ష్మీ కల్యాణం’ సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ దాదాపు అందరు అగ్ర హీరోలతో రొమాన్స్ చేసి సూపర్ డూపర్ హిట్స్ అందించింది. నేటికీ అదే బాటలో వెళుతూ మరోవైపు సోషల్ మీడియాలో తన మార్క్ చూపెడుతోంది కాజల్. ఈ నేపథ్యంలోనే తాజాగా ఆమె ఓ రేర్ ఫీట్ సాధించి వార్తల్లో నిలిచింది. సోషల్ మీడియా వేదిక ఇన్‌స్టాగ్రామ్‌లో ఎంతో యాక్టివ్‌గా ఉంటున్న కాజల్.. ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ లుక్స్ పోస్ట్ చేయడమే గాక తనకు సంబంధించిన వీడియోలను అప్‌లోడ్ చేస్తూ అభిమానులతో టచ్‌లో ఉంటోంది. దీంతో రోజురోజుకూ ఈ ముద్దుగుమ్మ ఫాలోయింగ్ రెట్టింపవుతూ వస్తోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఆమె ఫాలోవర్ల సంఖ్య 20 మిలియన్లకు చేరుకుంది. దీంతో టాలీవుడ్‌లో ఎక్కువ ఫాలోవర్లను కలిగిఉన్న హీరోయిన్ల జాబితాలో చేరిపోయింది. ఇది చూసి ఆమె ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఇకపోతే ఇటీవలే తన ప్రియుడు గౌతమ్ కిచ్లుని పెళ్లాడిన కాజల్.. కొన్ని నెలలపాటు అతనితో జాలీ ట్రిప్స్ ఎంజాయ్ చేసి తిరిగి తాను కమిటైన సినిమాలపై ఫోకస్ పెట్టింది. ఈ మేరకు అన్ని సినిమాలు చకచకా కంప్లీట్ చేస్తూ దర్శకనిర్మాతలకు డేట్స్ ఇస్తోంది. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఆచార్య' సినిమాలో హీరోయిన్‌గా చేస్తోంది కాజల్. అలాగే, ప్రవీణ్ సత్తారు రూపొందిస్తోన్న ‘ఘోస్ట్' మూవీలో అక్కినేని నాగార్జున సరసన నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇదిలా ఉంటే కాజల్ గర్భం దాల్చిందనే వార్తలు కూడా ఈ మధ్యకాలంలో వైరల్ అవుతున్నాయి. అయితే ఇలాంటి రూమర్స్‌పై ఆమె ఇప్పటిదాకా స్పందించలేదు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3pvTCUA

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....