Tuesday, 26 October 2021

సినిమాల్లోకి పూరి జగన్నాథ్ కూతురు.. నాన్న ఫోర్స్, ఆమె ఇంట్రెస్ట్ అంటూ అసలు విషయం చెప్పిన ఆకాష్

తెలుగు చిత్రసీమలో స్టార్ దర్శకుడిగా ఓ వెలుగు వెలుగుతున్నారు డైరెక్టర్ పూరి జగన్నాథ్. ఒకానొక సమయంలో వరుస హిట్స్ ఖాతాలో వేసుకున్న ఆయన కొన్నాళ్ల పాటు సైలెంట్ అయి తిరిగి 'ఇస్మార్ట్ శంకర్' సినిమాతో సక్సెస్ ట్రాక్ ఎక్కారు. అప్పటినుంచి యమ స్పీడులో దూసుకుపోతున్న పూరి.. మరోవైపు తన కొడుకు కెరీర్ పట్ల స్పెషల్ కేర్ తీసుకుంటున్నారు. ఈ మేరకు దగ్గరుండి మరీ ఆకాష్ పూరి హీరోగా 'రొమాంటిక్' సినిమా రూపొందించి అక్టోబర్ 29న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా పలు ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్నారు ఆకాష్ పూరి. తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో ఆయన తన సోదరి గురించి రియాక్ట్ అయ్యారు. త్వరలోనే కూడా టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు క్లారిటీ ఇచ్చారు. ఆమె ఇంట్రెస్ట్ ఏంటి? కెరీర్ ఎలా ప్లాన్ చేసుకుంటోంది అనే దానిపై వివరణ ఇచ్చారు ఆకాష్. 'బుజ్జిగాడు' సినిమాలో పవిత్ర చిన్నప్పటి త్రిష పాత్రలో కనిపించింది. దీంతో మళ్ళీ ఇప్పుడు ఆమె నటిగా కూడా వెండితెరపై కనిపిస్తుందనే వార్తలు ఊపందుకున్నాయి. ఈ క్రమంలో పవిత్ర సినీ ఎంట్రీపై స్పందించిన ఆకాష్.. తన సోదరికి యాక్టింగ్‌పై అస్సలు ఇంట్రెస్ట్ లేదని చెప్పారు. బుజ్జిగాడు టైంలోనే మా చెల్లి ఆ విషయం చెప్పిందని, కానీ నాన్నగారి ఫోర్స్ వల్లనే ఆ సినిమాలో నటించిందని అన్నారు. కాకపోతే తన చెల్లికి నిర్మాణ రంగంలోకి రావాలని ఎంతో ఆశగా ఉన్నట్లు ఆకాష్ చెప్పారు. మరికొన్ని సంవత్సరాలలో తను నిర్మాతగా కూడా అడుగులేసే అవకాశం ఉందని తెలిపారు. అంటే త్వరలోనే పూరి హౌస్ నుంచి మరో ప్రొడక్షన్ హౌస్ వస్తుందేమో అనేది స్పష్టమవుతోంది కదూ!.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2ZjsVHH

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....